Most Valuable Celebrities : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి మైదానంలోనే కాకుండా బ్రాండ్ మార్కెట్ ప్రపంచంలోనూ తన తిరుగులేని రాజసారాన్ని చాటుకున్నారు.
ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫార్చూన్ ఇండియా’ (Fortune India), గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ ‘ఇంటర్‌బ్రాండ్’ (Interbrand) సంయుక్తంగా నిర్వహించిన సరికొత్త అధ్యయనంలో భారతదేశంలోనే అత్యంత విలువైన సెలబ్రిటీగా (Most Valuable Celebrity) విరాట్ కోహ్లి అగ్రస్థానంలో నిలిచారు. ఈ నివేదిక ప్రకారం కోహ్లి ప్రస్తుత బ్రాండ్ వాల్యూ ఏకంగా ₹3,542 కోట్లుగా లెక్కగట్టారు. క్రీడా రంగంలో ఆయన సాధిస్తున్న రికార్డులు, సోషల్ మీడియాలో ఉన్న వందల మిలియన్ల ఫాలోవర్స్, యువతలో ఉన్న క్రేజ్ కారణంగా కార్పొరేట్ కంపెనీలు ఆయనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ మైలురాయి సాధ్యమైంది.
Read Also : టీఎంసీకి భారీ షాక్: సుఖేందు శేఖర్ రే రాజీనామా

టాప్-10లో సినీ, క్రీడా దిగ్గజాలు
దేశంలోని టాప్-25 మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటులు మరియు క్రీడాకారులు భారీగా పోటీ పడ్డారు. విరాట్ కోహ్లి తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ద్వితీయ స్థానంలో నిలవగా, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎంఎస్ ధోనీ (4వ స్థానం), రణ్‌వీర్ సింగ్ (5వ స్థానం), అక్షయ్ కుమార్ (6వ స్థానం), అమితాబ్ బచ్చన్ (7వ స్థానం), మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (8వ స్థానం), ఆలియా భట్ (9వ స్థానం) నిలిచారు. ఇక టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అంతర్జాతీయ క్రేజ్‌తో టాప్-10లో స్థానం సంపాదించుకుని దక్షిణాది సినిమా సత్తాను చాటారు. అలాగే దీపికా పదుకొణె 11వ స్థానంలో, నేషనల్ క్రష్ రష్మిక మందన్న 17వ స్థానంలో నిలిచి తమ బ్రాండ్ పవర్‌ను నిరూపించుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

