Indrakeeladri VIP Darshan: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుస సెలవుల కారణంగా భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ఇవాళ వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
Read Also :TTD updates: తిరుమలలో టోకెన్ లేని భక్తులకు 30 గంటలు
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు

ఘాట్ రోడ్ మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో వీఐపీ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు.
Indrakeeladri VIP Darshan: సామాన్య భక్తులకు సులభంగా దర్శనం
వరుస సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లలో రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల సామాన్య భక్తులకు దర్శనం మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు. భక్తుల రద్దీ, ఘాట్ రోడ్ మరమ్మతులను దృష్టిలో ఉంచుకుని అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

