Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలలో టోకెన్ లేని భక్తులకు 30 గంటలు

తిరుమలలో టోకెన్ లేని భక్తులకు 30 గంటలు

వార్త 2 weeks ago

TTD updates:తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తిరుమలలో భక్తుల భారీ రద్దీ సర్వదర్శనానికి 30 గంటలు పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రూములు అన్నీ భక్తులతో నిండిపోయాయి.

సర్వదర్శనం కోసం వచ్చిన జనం బయట లైన్లలో చాలా సేపు నిరీక్షించాల్సి వస్తోంది. ఎలాంటి టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది.

Tirumala Darshan: శ్రీవాణి భక్తులకు ముఖ్య గమనిక..రెండు రోజుల పాటు శ్రీవాణి టికెట్ల బుకింగ్ రద్దు

 Huge rush of devotees; 30 hours for Sarva Darshan.

ఒక్కరోజులోనే వేలాది మంది భక్తుల రాక

నిన్న ఒక్కరోజే తిరుమలలో భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 78,445 మంది భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 40,098 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.4.3 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

TTD updates:ప్రయాణానికి ముందే రద్దీ వివరాలు చూడండి

భక్తులు తిరుమల ప్రయాణానికి ముందు రద్దీ వివరాలు గమనించాలి. క్యూలైన్లలో వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నందున భక్తులు ఓపిక పట్టాలి. ముసలివాళ్లు చిన్నపిల్లల తోటి వచ్చేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తాగునీరు, అల్పాహారం అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారు.

Epaper: epaper.vaartha.com

50 వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్​

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha