Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
INDvsPAK: మ్యాచ్‌కు ముందు మ్యూజికల్ షో, 'ధురంధర్' పాటలతో హైప్

INDvsPAK: మ్యాచ్‌కు ముందు మ్యూజికల్ షో, 'ధురంధర్' పాటలతో హైప్

వార్త 3 months ago

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ కొలంబోలో జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు(INDvsPAK) ముందు ప్రత్యేక మ్యూజికల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ ప్రీ-మ్యాచ్ షోలో 'ధురంధర్' సినిమా పాటలను ప్లే చేయడంతో పాటు ప్రముఖ ర్యాపర్ హనుమాన్‌కైండ్ స్టేజ్‌పై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని క్రీడా వర్గాలు వెల్లడించాయి.

ఈ సినిమా పాక్‌ మరియు గల్ఫ్ దేశాల్లో నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ఈ మ్యాచ్‌కు హాజరయ్యే పాకిస్థాన్ జట్టు సభ్యులు మరియు పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ(INDvsPAK) ఈ సంగీత కార్యక్రమాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. ఈ అంశం మ్యాచ్‌కు ముందే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు ఈ మ్యూజిక్ షో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచనుందని నిర్వాహకులు చెబుతున్నారు. స్టేడియం వాతావరణం మ్యాచ్ ప్రారంభానికి ముందే హైప్‌కి చేరుతుందని అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha