AP TET: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు (In-service Teachers) విద్యాశాఖ తీపి కబురు అందించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( Special Teacher Eligibility Test - TET ) దరఖాస్తుల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
అర్హులైన ఉపాధ్యాయులు నిర్దేశిత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
Read Also :Special TET Notification : ఏపీలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

ముఖ్యమైన తేదీలు (Important Dates)
- దరఖాస్తుల ప్రారంభ తేదీ: నేటి నుండి ప్రారంభం.
- దరఖాస్తుల ముగింపు తేదీ: సెప్టెంబర్ 24.
- పరీక్షల నిర్వహణ తేదీలు: అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 21 వరకు.
AP TET: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం
- మొదట ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోమ్‌పేజీలో ఉన్న In-service Teachers Special TET Application Form లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ సర్వీస్ ఐడీ (Treasury ID / Treasury Code) మరియు వ్యక్తిగత వివరాలతో లాగిన్ అవ్వాలి.
- అవసరమైన సమాచారాన్ని సమర్పించి, సంబంధిత ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
- దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని ప్రింట్‌అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

