Chittoor Girls Missing :ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించుతోంది. రంగుల ప్రపంచంలో మునిగిపోతున్న యువత, మైనర్లు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని జీవితాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లాలో ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ఇద్దరు బాలికలు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కలకలం రేపింది.
Read Also: Breaking news: Delhi Airport Planes Collision: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్.. 2 విమానాలు ఢీ!
అసలేం జరిగింది?
చిత్తూరు నగరం కొంగారెడ్డి పల్లికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోవడంతో చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Chittoor Girls Missing: రంగంలోకి దిగిన పోలీసులు – స్పెషల్ టీమ్స్ గాలింపు
కేసు తీవ్రతను గుర్తించిన సీఐ మహేశ్వర, బాలికల ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టెక్నాలజీని ఆయుధంగా చేసుకుని పోలీసులు గాలింపు చేపట్టారు.బాలికల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను పరిశీలించగా, అపరిచితులతో వారు చాటింగ్ చేసినట్లు గుర్తించారు.నగరంలోని కీలక ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను జల్లెడ పట్టారు.టెక్నికల్ టీమ్ సాయంతో వారు గుంటూరు, ఒంగోలు పరిసరాల్లో ఉన్నట్లు పక్కా సమాచారం సేకరించారు.ఆయా జిల్లాల పోలీసుల సహకారంతో వారిని గుర్తించి పట్టుకున్నారు.
Chittoor Girls Missing Case Instagramబాలికలను పట్టుకున్న తర్వాత వారిని ప్రశ్నించిన పోలీసులకు దిమ్మతిరిగి పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన వ్యక్తులతో కలిసి టూర్‌కు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఆ ఇద్దరు బాలికలు ఇంటి నుంచి బయటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే తమ ఇళ్లలో చెబితే టూర్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వరనే భయంతోనే ఎవరికీ చెప్పకుండా వెళ్లినట్లు వివరించారు. తల్లిదండ్రులు సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వేగంగా స్పందించి.. ఆ ఇద్దరు బాలికలకు ఎలాంటి హాని లేకుండా రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

