Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిచ్చగాడిని చంపి తాను చనిపోయినట్లు నమ్మించిన కానిస్టేబుల్

బిచ్చగాడిని చంపి తాను చనిపోయినట్లు నమ్మించిన కానిస్టేబుల్

వార్త 2 months ago

Uttar Pradesh Crime: రక్షక భట నిలయంలో పనిచేసి, నేరస్తుల మనస్తత్వాన్ని ఔపోసన పట్టిన ఒక మాజీ కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. చట్టం కళ్లుగప్పి, తనపై ఉన్న లెక్కలేనన్ని క్రిమినల్ కేసుల నుంచి శాశ్వతంగా విముక్తి పొందాలని మృత్యువుతోనే జూదమాడాడు.

సినిమాల్లో కనిపించే విధంగా తన మరణాన్ని తానే సృష్టించుకోవాలని చూసి, ఒక అమాయక ప్రాణాన్ని బలితీసుకున్నాడు.

మార్చి 12వ తేదీన హాథ్రస్ రోడ్ హాల్ట్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక రేకుల షెడ్డులో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఒక వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం పక్కనే మెయిన్‌పురి జిల్లాకు చెందిన 55 ఏళ్ల రామ్‌వీర్ సింగ్ ఐడెంటిటీ కార్డులు, వ్యక్తిగత వస్తువులు లభించాయి. దీంతో చనిపోయింది రామ్‌వీర్ సింగ్ అని పోలీసులు, అతని కుటుంబ సభ్యులు భావించారు.

Read Also: Bhadradri Kothagudem crime: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఒత్తిడే కారణమా?

 Former constable kills beggar to escape charges

Uttar Pradesh Crime: ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు?

కేసును లోతుగా దర్యాప్తు చేసిన జీఆర్పీ పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. రామ్‌వీర్ సింగ్ గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసి, నేరపూరిత ప్రవర్తన కారణంగా ఉద్యోగం కోల్పోయినట్లు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో సాంకేతిక అంశాలు, సాక్ష్యాలు ఆ శవం రామ్‌వీర్‌ది కాదని స్పష్టం చేశాయి. దీంతో అతను బతికే ఉన్నాడని నిర్ధారించుకున్న పోలీసులు నిఘా పెట్టి, ఏప్రిల్ 14న అతడిని అదుపులోకి తీసుకున్నారు.

రామ్‌వీర్ సింగ్ విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. అతనిపై ఫిరోజాబాద్, అలీగఢ్, మురాదాబాద్ సహా పలు జిల్లాల్లో హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీలు, ఫోర్జరీ వంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఈ కేసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి, తను చనిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మించాలని ప్లాన్ వేశాడు.

పోలీసుల హెచ్చరిక

రామ్‌వీర్ సింగ్ ఒక అలవాటు పడిన నేరస్థుడు. చట్టం నుంచి తప్పించుకోవడానికి ఎంతటి దారుణానికైనా వెనుకాడడని ఈ ఘటన నిరూపిస్తోంది అని జీఆర్పీ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుయష్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. చనిపోయిన భిక్షగాడు ఎవరు అనే వివరాలను సేకరిస్తున్నామని, నిందితుడిపై హత్య కేసుతో పాటు మరిన్ని కఠిన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆస్తి కోసం కుట్ర.. రెండో భార్యతో కలిసి విషం పెట్టి చంపాలని ప్లాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha