Telangana Inter Results 2026: రాష్ట్రంలో వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల మూలంగా నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటర్లో ఫెయిలైనందుకు ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోగా..
మరొక విద్యార్థ ఫెయిల్ అవుతాననే భయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో కంట్లో ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉట్నూర్ మండలంలో చోటు వేసుకుంది.
Read Also: Inter Results : ఇంటర్ ఫలితాల వేళ తెలంగాణ లో తీవ్ర విషాదం.. 8 మంది విద్యార్థుల ఆత్మహత్య
Four students commit suicide after Inter results
Telangana Inter Results 2026: ఉట్నూర్ మండలంలో విద్యార్థిని సౌజన్య ఆత్మహత్య
కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలంలోని దంతన్పల్లికి చెందిన జిల్లపెల్లి బక్కన్న, బుద్భవ్య దృవ్వ దంపతుల కుమార్తె సౌజన్య(17) ఉట్నూర్లో ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆదివారం ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల కాగా ఫలితాలలో ఫెయిల్ అవ్వరంతో తీవ్ర మరస్తాపానికి సురైంది. ఇం ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకి పాల్ప డింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సౌజన్యను ఉట్నూర్లోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందినట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో మరో విషాదం
ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానన్న బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల వరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో జరిగింది. జక్కుల శ్రావణి (16) భూత్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదవి పరీక్షలు రాసింది. ఆదివారం విడుదలైన ఫలితాల శ్రావణి ఫెయిల్ అయింది. దీంతో మానసిక వేదన చెంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పాస్ అయినా దక్కని ప్రాణం
రెండు రోజుల క్రితమే విద్యార్థి ఆత్మహత్య.. ఇంటర్ ఫలితాల వేళ ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనకల్ మండలం రాంపల్లి గ్రామానికి చెందిన గంగదేవుళ్ల లక్షాంత్ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశాడు. పరీక్షలు సరిగ్గా రాయలేదని బాధపడుతూ రెండు రోజుల కింద మధిరలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తియితే ఆదివారం చేసిన ఫలితాలను చెక్ చేయగా అతను అన్ని నబ్జెక్టులు పాస్ కావడం గమనార్హం. అక్షాంత కు ఇంగ్లీష్లో 67, సంస్కృతంలో 60, మ్యాథ్స్ 1ఏలో 40, మ్యాక్స్1బిలో 58, ఫిజిక్స్ 49, కెమిస్ట్రీలో 54, ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ 19 మార్కులు వచ్చాయి. మొత్తంగా ఫస్టియర్లో 470 మార్కులకుగానూ 347 మార్యులు సాధించిన ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఫలితాలు రాకముందే, ఫెయిల్ అవుతాడనే భయంతో ఆక్షాంత్ అత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

