Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కీలక మార్పులు

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కీలక మార్పులు

వార్త 3 weeks ago

Inter First Year Exams : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ పరీక్షా విధానంలో పలు మార్పులు చేసింది. కొత్త సిలబస్‌తో పాటు అన్ని సబ్జెక్టుల్లో అంతర్గత మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టింది.

దీంతో విద్యార్థులు థియరీ పరీక్షలతో పాటు ప్రాక్టికల్స్, యాక్టివిటీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త విధానంలో రాత పరీక్షకు 80 శాతం, ప్రాక్టికల్స్ లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు 20 శాతం మార్కులు కేటాయించారు. 80 మార్కుల థియరీ పరీక్షలో పాస్ కావాలంటే కనీసం 28 మార్కులు, 20 మార్కుల ప్రాక్టికల్‌లో కనీసం 7 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

Key Decisions : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

 Inter First Year Exams

Inter First Year Exams : గణితంలోనూ మార్కుల విధానంలో మార్పు

గణిత శాస్త్రంలో తుది పరీక్షను 75 మార్కులకు బదులుగా 60 మార్కులకు నిర్వహించనున్నారు. మిగిలిన 15 మార్కులను అంతర్గత మూల్యాంకనానికి కేటాయించారు. హ్యుమానిటీస్ విభాగంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు 20 మార్కులు కేటాయించారు. భాషా సబ్జెక్టుల పబ్లిక్ పరీక్షలను ఇకపై 100 మార్కులకు బదులుగా 80 మార్కులకు నిర్వహించనున్నారు. మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా కేటాయిస్తారు. సెకండియర్‌లో ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంతో పాటు ప్రాక్టికల్ మాన్యువల్ కూడా అందుబాటులో ఉండనుంది. కొత్త పరీక్షా విధానం, సబ్జెక్టుల వారీగా థియరీ, ప్రాక్టికల్స్ మార్కుల వివరాలను తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులకు కొత్త విధానంపై కళాశాలల ప్రిన్సిపాళ్లు పూర్తి అవగాహన కల్పించాలని బోర్డు సూచించింది.

సీఎం రేవంత్ కు థాంక్స్ చెప్పిన కేటీఆర్..ఎందుకంటే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha