Telangana Inter Memo Correction: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు నిన్న (ఆదివారం) విడుదలైన నేపథ్యంలో, విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక సూచనలు చేసింది.
ఆన్‌లైన్ మార్క్స్ మెమోల్లో అభ్యర్థుల పేర్లు, తండ్రి పేరు, పుట్టిన తేదీ లేదా మార్కుల వంటి అంశాల్లో ఏవైనా తప్పులు దొర్లితే వెంటనే సరిచేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ సవరణల కోసం విద్యార్థులకు 10 రోజుల గడువు విధించింది.
Read Also: Inter Results : ఇంటర్ ఫలితాల వేళ తెలంగాణ లో తీవ్ర విషాదం.. 8 మంది విద్యార్థుల ఆత్మహత్య
Are there any mistakes in the Inter Memo? Board orders to file a complaint within 10 days!
ఫిర్యాదు చేయడం ఎలా?
మార్క్స్ మెమోలో తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే విద్యార్థులు రెండు పద్ధతుల్లో ఫిర్యాదు చేయవచ్చు:
- కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా: విద్యార్థులు తమ సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్‌ను సంప్రదించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం ద్వారా తప్పులను సరిచేసుకోవచ్చు.
- ఈమెయిల్ ద్వారా: నేరుగా ఇంటర్ బోర్డు హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఐడీ helpdesk-ie@telangana.gov.in కు ఫిర్యాదు పంపవచ్చు.
Telangana Inter Memo Correction: సమయం దాటితే ఇబ్బందే..
ఫలితాలు విడుదలైన 10 రోజులలోపు ఫిర్యాదు చేయని పక్షంలో, భవిష్యత్తులో మార్పులు చేయడం కష్టతరమవుతుందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా పైచదువులకు వెళ్లేటప్పుడు మెమోలోని వివరాలు అత్యంత కీలకం కాబట్టి, విద్యార్థులు తమ ఆన్‌లైన్ మెమోలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

