Dailyhunt
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు!

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు!

వార్త 1 week ago

TG Inter Supplementary Exams 2026: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు ఫీజు చెల్లించలేకపోయిన వారి కోసం గడువును మే 4వ తేదీ వరకు పొడిగించింది.

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిలైన విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

Read Also: Siddipet: ఆధ్యాత్మికతకు… అన్నదానలకు పెట్టింది పేరు.. మన సిద్దిపేట: హరీష్ రావు

 TG Inter Supplementary Fee Extension

TG Inter Supplementary Exams 2026: ఫీజు, దరఖాస్తు వివరాలు

ఈ పొడిగించిన గడువులో దరఖాస్తు చేసుకునే వారు రూ. 3,000 ఆలస్య రుసుము (Late Fee) చెల్లించాల్సి ఉంటుంది. మే 4 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. ఇదే చివరి అవకాశం కావడంతో విద్యార్థులు వెంటనే స్పందించాలని బోర్డు సూచించింది.

పరీక్షల షెడ్యూల్, సమయాలు

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలను ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 9:00 AM నుండి 12:00 PM వరకు, మధ్యాహ్నం సెషన్ 2:00 PM నుండి 5:00 PM వరకు. థియరీ పరీక్షలు ముగిసిన వెంటనే, మే 22 నుంచి 25వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కోడూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha