Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోడూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

కోడూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వార్త 1 month ago

Sangareddy Agriculture News: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కోడూరు గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారం స్థానిక నాయకులు, అధికారులు కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే విక్రయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటే రైతులకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని తెలిపారు.

Read Also:Gummadidala: గుమ్మడిదల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ ఆధిపత్యం

రైతులు మధ్యవర్తుల పాలవకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకోవడం వల్ల న్యాయమైన ధర లభిస్తుందని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, కాంగ్రెస్ నాయకులు రవీందర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వహణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha