Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL హిస్టరీలోనే తొలిసారి ఇలా !!

IPL హిస్టరీలోనే తొలిసారి ఇలా !!

వార్త 2 weeks ago

IPL History : ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ బ్యాటర్ల పండగను తలపిస్తోంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రతి మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఐపీఎల్ 19 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా ఒక అరుదైన, సంచలన రికార్డు నమోదైంది. ఒకే ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు 700కు పైగా పరుగులు (700+ Runs) సాధించడం టోర్నీ హిస్టరీలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ (RR) యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో టాప్‌లో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ (GT) రథసారథి శుభ్‌మన్ గిల్ 722* పరుగులతో, అదే జట్టుకు చెందిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్ 710* పరుగులతో ఈ అద్భుతమైన మైలురాయిని అందుకున్నారు. బౌలర్లపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చలాయిస్తూ ఈ ముగ్గురు సృష్టించిన పరుగుల విధ్వంసం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

Read Also : లక్నో కెప్టెన్సీకి రిషబ్ పంత్ గుడ్ బై.. అధికారికంగా ప్రకటించిన యాజమాన్యం

గుజరాత్ టైటాన్స్ డబుల్ ధమాకా

ఈ అరుదైన రికార్డుతో పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను మరింత థ్రిల్ కి గురిచేస్తున్న అంశం ఏంటంటే.. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో ఒకే ఫ్రాంచైజీకి చెందిన ఇద్దరు ఆటగాళ్లు 700 ప్లస్ పరుగులు చేయడం కూడా ఇదే మొదటిసారి. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఈ ఘనత సాధించి తమ జట్టును సరికొత్త రికార్డు బుక్స్‌లో ఎక్కించారు. నిలకడైన భాగస్వామ్యాలతో, క్లాస్ షాట్లతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించిన ఈ జోడి.. టీ20 క్రికెట్‌లో ఒకే జట్టు నుంచి ఇంత భారీ స్కోర్లు నమోదు చేయడం అసాధ్యం కాదని నిరూపించింది. టోర్నమెంట్ ఆఖరి దశకు చేరిన తరుణంలో వీరిద్దరి రన్ రేట్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ రికార్డును అందుకోవడం మరే ఇతర జట్టుకైనా అంత సులువు కాదని స్పష్టమవుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఫైనల్‌కు గుజరాత్..ఆర్సీబీతో టైటిల్ ఫైట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha