Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లక్నో కెప్టెన్సీకి రిషబ్ పంత్ గుడ్ బై.. అధికారికంగా ప్రకటించిన యాజమాన్యం

లక్నో కెప్టెన్సీకి రిషబ్ పంత్ గుడ్ బై.. అధికారికంగా ప్రకటించిన యాజమాన్యం

వార్త 2 weeks ago

Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో లక్నో జట్టు సారథ్య బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తప్పుకున్నాడు.

ఈ సీజన్‌లో ఎల్ఎస్‌జీ ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఆడిన 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని పంత్ స్వయంగా కోరగా అందుకు తాము అంగీకరించినట్లు లక్నో ఫ్రాంచైజీ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించింది.

పంత్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం: లక్నో క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ

నాయకత్వ పదవి నుంచి వైదొలగాలన్న రిషబ్ పంత్ నిర్ణయానికి యాజమాన్యం ఆమోదం తెలిపిందని లక్నో సూపర్ జెయింట్స్ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ స్పష్టం చేశారు. “జట్టు కోసం ఇంతకాలం రిషబ్ పంత్ అందించిన సహకారం, చూపిన నిబద్ధత అభినందనీయం. అతని నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. ఇకపై సరికొత్త వ్యూహాలతో జట్టును తిరిగి పునర్నిర్మించడం (Rebuild) పైనే మా పూర్తి దృష్టి ఉంటుంది” అని టామ్ మూడీ పేర్కొన్నారు.

Read also:IPL 2026 New Rules:ఫైనల్‌కు ముందు కొత్త రూల్స్ తీసుకొచ్చిన BCCI!

Rishabh Pant: రూ.27.50 కోట్ల రికార్డు ధర.. కానీ తప్పని నిరాశ!

రిషబ్ పంత్ గతంలో సుదీర్ఘ కాలం పాటు (ఎనిమిది సీజన్లు) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27.50 కోట్ల రికార్డు ధర వెచ్చించి పంత్‌ను దక్కించుకుంది. ఆ వెంటనే అతనికి జట్టు పగ్గాలను కూడా అప్పగించింది.

అయితే, పంత్ నాయకత్వంలో లక్నో గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. అంతకుముందు (2025) ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 6 గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన లక్నో ఈ 2026 సీజన్‌లో 10 ఓటములతో అత్యంత దారుణంగా టేబుల్ బాటమ్‌కు పడిపోయింది. ఈ సీజన్‌లో రిషబ్ పంత్ వ్యక్తిగతంగా 312 పరుగులు చేసినప్పటికీ, జట్టును విజయపథంలో నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

2022లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మొదటి మూడు సీజన్ల పాటు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించాడు. రాహుల్ కెప్టెన్సీలో లక్నో జట్టు వరుసగా రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుని అద్భుత ప్రదర్శన చేసింది. ఒక సీజన్‌లో మాత్రం ఏడో స్థానంతో ముగించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

వినేశ్ ఫోగట్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha