Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ అంతు చూస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు..రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు

ఇరాన్ అంతు చూస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు..రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు

వార్త 2 weeks ago

Iran-America War : పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ భగ్గుమనేలా ఉన్నాయి. ఇరాన్-యుఎస్ (Iran-US) మధ్య నెలకొన్న శాంతి ఒప్పందంపై మళ్లీ నీలి నీడలు కమ్ముకున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వార్నింగ్ మధ్య పరిస్థితులు మళ్లీ క్లిష్టతరంగా మారాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: Trump Accounts: చిన్నారుల కోసం 'ట్రంప్ అకౌంట్స్': గంట మోగించిన అమెరికా అధ్యక్షుడు

 Iran-America War

ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ధిక్కార వైఖరి

తమ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ మరణానంతరం టెహ్రాన్‌లో రోజుల తరబడి అంత్యక్రియలు జరుగుతున్నప్పటికీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ధిక్కార వైఖరిని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. వాషింగ్టన్‌తో వెంటనే ఒక అనుకూలమైన ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో తామే స్వయంగా రంగంలోకి దిగి “పని పూర్తి చేస్తాం” అంటూ సైనిక చర్యకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. మరిన్ని కనుగొనండి Chemistry స్టాక్ మార్కెట్ ఫలితాలు మల్టీబ్యాగర్ స్టాక్ Financial Markets News Lottery వ్యాపార వార్త Economics తాము ఇరాన్ వంతెనలను కేవలం ఒక గంటలోనే కూల్చివేయగలమని.. వారి విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయగలమని హెచ్చరిస్తూ ఆర్థిక, మౌలిక సదుపాయాల ఒత్తిడిని పెంచే బెదిరింపులను ఆయన పునరుద్ఘాటించారు.

Iran-America War : ఆచరణాత్మక ఫలితాలను ఇవ్వలేదు

యుద్ధం ద్వారా అక్కడి 91 మిలియన్ల ప్రజలపై ప్రభావం చూపడం ఇష్టం లేనందునే తాను ఒప్పందానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. నిజానికి పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరిగినప్పటికీ, అవి ఎటువంటి ఆచరణాత్మక ఫలితాలను ఇవ్వలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరిపిన తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవడంతో.. దౌత్య చర్చల కోసం ఇరుపక్షాల మధ్య 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. టెహ్రాన్‌ను అణ్వాయుధ అభివృద్ధి నుండి నిరోధించడం, అత్యంత సుసంపన్నమైన యురేనియంను తిరిగి అప్పగించేలా చేయడం వంటి లక్ష్యాలతో వాషింగ్టన్ ఈ చర్చలు జరిపింది.

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత: చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha