Dailyhunt
ఇరాన్ చమురు కొనుగోలు వార్తలను ఖండించిన రిలయన్స్

ఇరాన్ చమురు కొనుగోలు వార్తలను ఖండించిన రిలయన్స్

వార్త 3 weeks ago

Reliance Industries-Iran Crude Oil: భారతీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ఇరాన్ నుండి ముడి చమురు కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించింది.

గురువారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో, ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవి అని కంపెనీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొంది.

Read Also:Petrol Diesel Shortage : 60 రోజుల స్టాక్ ఉంది.. కేంద్రం సంచలన ప్రకటన

 Reliance Industries Iran Crude Oil Deal Denied

రాయిటర్స్ కథనం, వివాదం నేపథ్యం

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం.. రిలయన్స్ సంస్థ నేషనల్ ఇరానీయన్ ఆయిల్ కంపెనీ (NIOC) నుండి సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసిందని నివేదించింది. అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను సడలించడంతో, బ్రెంట్ ఫ్యూచర్స్ కంటే ఎక్కువ ధరకు ఈ లావాదేవీ జరిగిందని, ఏప్రిల్ 19 నాటికి డెలివరీ అయ్యేలా ఒప్పందం కుదిరిందని ఆ కథనంలో పేర్కొన్నారు.

వాస్తవాలను నిర్ధారించుకోవాలని రిలయన్స్ సూచన

ఈ నివేదికలపై రిలయన్స్ స్పందిస్తూ.. “ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేశామన్న వార్తల్లో నిజం లేదు. ఇలాంటి సున్నితమైన కథనాలు ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి” అని హితవు పలికింది. మార్చి 20న లోడ్ చేసి, ఏప్రిల్ నాటికి డెలివరీ చేసేలా ఎలాంటి ఒప్పందాలు తాము చేసుకోలేదని కంపెనీ స్పష్టమైన వివరణ ఇచ్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

వాహనదారులకు బిగ్ షాక్..భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha