Trump On Iran Deal : అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత సవాళ్లతో కూడుకున్నవిగా మారుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన షరతులను అంగీకరించేందుకు ఇరాన్ నిరాకరించడంతో దౌత్యపరమైన చర్చలు తుది కొలిక్కి రావడం లేదు.
హర్మూజ్ జలసంధి ప్రాంతంతో పాటు సరిహద్దుల వద్ద పూర్తి నియంత్రణ అమెరికా చేతుల్లోనే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో భద్రత, వాణిజ్య మార్గాల పర్యవేక్షణ విషయంలో అమెరికా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారు.
Trump On Iran Deal
Trump On Iran Deal :ప్రధాన వివాదాస్పద అంశాలు
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ Operation Economic Furyపేరుతో కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. ఇరాన్‌తో వ్యాపారం లేదా ఆర్థిక లావాదేవీలు జరిపే ఏ దేశమైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇంధన రవాణాకు అత్యంత కీలకమైనStrait of Hormuzప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Trump) ప్రకటిస్తుండగా, ఈ జలసంధి కేవలం తమ నియంత్రణలోనే తెరుచుకుంటుందని ఇరాన్ విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. అమెరికా ఆరోపణల ప్రకారం, ఇరాన్‌లో ద్రవ్యోల్బణం దాదాపు 350 శాతానికి చేరడంతో పాటు సైనిక వ్యవస్థలు, ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో సంక్షోభం ఏర్పడింది. అయితే ఈ గణాంకాలను ఇరాన్ మీడియా వాస్తవ దూరమైనవని కొట్టిపారేసింది. రెండు దేశాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. అమెరికాలో తన ఆర్థిక ఒడిదొడుకుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి నాటకీయ ప్రకటనలు చేస్తోందని సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి ఆరోపించారు. అంతకుముందు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘర్ గాలిబఫ్ ఇదే అదే అంశంపై తీవ్రంగా స్పందించారు. అమెరికా తన 14 పాయింట్ల అవగాహనా ఒప్పందంలోని షరతులను అమలు చేసే వరకు, చమురు ఆంక్షలను ఎత్తివేసి ప్రసక్తే లేదన్నారు.
అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల వ్యూహం గతంలోలాగే మళ్లీ విఫలమవుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. తమపై చమురు ఆంక్షలు ఎత్తివేసే వరకు మరియు14-point frameworkనిబంధనలకు అంగీకరించే వరకు లొంగిపోయే ప్రసక్తి లేదని తెలిపారు.

