Dailyhunt
ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి! అమెరికా నౌకాదళానికి అధ్యక్షుడు సంచలన ఆదేశాలు

ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి! అమెరికా నౌకాదళానికి అధ్యక్షుడు సంచలన ఆదేశాలు

వార్త 1 week ago

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడును ప్రదర్శించారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చర్చల దశలో ఉన్నప్పటికీ, హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల కదలికలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికా నౌకలకు విఘాతం కలిగిస్తూ, సముద్రంలో మందుపాతరలు (మైన్లు) వేస్తున్న ఏ ఇరాన్ నౌకనైనా తక్షణమే కాల్చివేయాలని యూఎస్ నేవీని ఆదేశించారు.

Read Also:France Visa Update: వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!

Donald Trump: ట్రూత్ సోషల్ వేదికగా ఆదేశం

ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ విషయంలో ఎటువంటి సంకోచం అవసరం లేదని, అమెరికా రక్షణ విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.”హర్మూజ్ జలసంధిలో మైన్లు పెడుతూ మా నౌకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ కు చెందిన ఏ చిన్న పడవనైనా (Gunboats) కాల్చి ధ్వంసం చేయాలని నావికాదళాన్ని ఆదేశించాను.”ట్రంప్‌ పేర్కొన్నారు.

 Trump orders US Navy to shoot Iranian boats

అంతేకాదు ఇరాన్ ప్రస్తుతం తమ నాయకుడు ఎవరో తేల్చుకోలేక ఇబ్బందులు పడుతోందని సెటైర్లు వేశారు. హర్మూజ్‌పై తాము పూర్తిగా నియంత్రణ సాధించామని పేర్కొన్నారు. అమెరికా నేవీ పర్మిషన్ లేకుండా ఏదైనా నౌక ప్రవేశించడం గానీ.. బయటకు వెళ్లడం లాంటిది ఉండదని తెలిపారు. తమతో ఇరాన్ ఒప్పందానికి వచ్చేవరకు ఇది మూసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మాల్దీవుల ప్రయాణికులకు ఎన్సీబీ అలర్ట్ - కొత్త డ్రగ్స్ చట్టాల గురించి మీకు తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha