Dailyhunt
మాల్దీవుల ప్రయాణికులకు ఎన్సీబీ అలర్ట్ - కొత్త డ్రగ్స్ చట్టాల గురించి మీకు తెలుసా?

మాల్దీవుల ప్రయాణికులకు ఎన్సీబీ అలర్ట్ - కొత్త డ్రగ్స్ చట్టాల గురించి మీకు తెలుసా?

వార్త 1 week ago

NCB Alert for Maldives Travellers: వేసవి సెలవుల్లో మాల్దీవుల అందాలను చూడాలని ప్లాన్ చేస్తున్న భారతీయ పర్యాటకులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) గట్టి హెచ్చరిక జారీ చేసింది.

ఆ దేశంలో మాదకద్రవ్యాల నిరోధక చట్టాలను అత్యంత కఠినతరం చేసిన నేపథ్యంలో, చిన్న పొరపాటు చేసినా ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

Read Also: France Visa Update: వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!

కొత్త చట్టం – కఠిన శిక్షలు

మాల్దీవుల ప్రభుత్వం ఇటీవల తన డ్రగ్స్ చట్టాలకు సవరణలు చేసింది. 2026 మార్చి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం.భారీ స్థాయిలో మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడితే కోర్టు అనుమతితో మరణశిక్ష విధించే అవకాశం ఉంది.డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడిన వారికి జీవిత ఖైదుతో పాటు భారీ జరిమానాలు విధిస్తారు.స్వల్ప పరిమాణంలో డ్రగ్స్ దొరికినప్పటికీ కఠిన శిక్షలు అమలు చేస్తారు.

 New Drug Laws in Maldives 2026

NCB Alert for Maldives Travellers: ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలు

భారత పౌరులు తమ పర్యటనలో చిక్కుల్లో పడకుండా ఉండాలని ఎన్సీబీ కొన్ని సూచనలు చేసింది. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే జాతీయ నార్కోటిక్స్ హెల్ప్‌లైన్ నంబర్ **’1933’**కు సమాచారం అందించాలి.విమానాశ్రయాలు లేదా పోర్టులలో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ప్యాకెట్లు, వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లకూడదు.మీ లగేజీలో ఏముందో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇతరులు ఇచ్చిన వస్తువుల ద్వారా మీరు డ్రగ్స్ ట్రాప్ లో పడే అవకాశం ఉంది.”చట్టం గురించి మాకు తెలియదు” అనే వాదన కోర్టులో చెల్లదని, కాబట్టి స్థానిక చట్టాలను గౌరవించాలని భారత హైకమిషన్ సూచించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బెంగాల్, తమిళనాడులో పోటెత్తిన ఓటర్లు.. 2021 కంటే భారీగా పోలింగ్ నమోదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha