US - Iran : ఇరాన్‌తో సాగుతున్న సైనిక ఘర్షణలు మరియు యుద్ధ చర్యల నిమిత్తం అమెరికా ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను వెచ్చిస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఏకంగా 37.5 బిలియన్ డాలర్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.
3.60 లక్షల కోట్లు) ఖర్చయినట్లు యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ అధికారికంగా వెల్లడించారు. సేనెట్ అప్రోప్రియేషన్స్ కమిటీ (Senate Appropriations Committee) ముందు తొలిసారి హాజరైన ఆయన, ఇరాన్‌పై చేపడుతున్న క్షిపణి దాడులు, ఆయుధ సమీకరణ మరియు మిలిటరీ మోహరింపుల కోసం అయిన వ్యయం వివరాలను పక్కా గణాంకాలతో సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ భారీ ఖర్చు అమెరికా రక్షణ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
యుద్ధ వ్యయం సమర్థన: మరో $67 బిలియన్ల నిధుల కోసం హెగ్సెత్ విజ్ఞప్తి
అంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, పీట్ హెగ్సెత్ ఈ యుద్ధ వ్యయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. రక్షణ ప్రయోజనాలు మరియు సైనిక వ్యూహాల దృష్ట్యా ఈ ఖర్చు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో ఇరాన్ నుండి ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి మరియు యుద్ధ క్షేత్రంలో వ్యూహాత్మక ఆధిక్యతను నిలబెట్టుకోవడానికి సైన్యానికి మరో 67 బిలియన్ డాలర్ల అదనపు నిధులను తక్షణమే మంజూరు చేయాలని సెనేట్‌ను అభ్యర్థించడం గమనార్హం. కాంగ్రెస్ నుండి ఈదనపు నిధుల ఆమోదం లభిస్తే ఇరాన్‌తో అమెరికా చేస్తున్న పోరాటం మరింత సుదీర్ఘంగా సాగే అవకాశాలు కనిపాయి.
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం..సౌదీ షిప్పింగ్‌కు పెను ముప్పు!

