Dailyhunt
ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం వైపు ప్రపంచం

ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం వైపు ప్రపంచం

వార్త 6 days ago

స్‌బిఐ (SBI) రీసెర్చ్ నివేదిక విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచం యుద్ధ భయాలు, చమురు సంక్షోభం, 'సూపర్ ఎల్ నినో' వంటి ముప్పుల మధ్య ఉన్నప్పటికీ..

భారత ఆర్థిక వ్యవస్థ ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను ఓ సారి పరిశీలిస్తే.. చారిత్రక ఆధారాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే 2007 నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం అమెరికా ఇంధన విషయంలో స్వయం సమృద్ధి సాధించడం, అక్కడి ప్రజలకు పన్ను వాపసుల రూపంలో ప్రభుత్వ మద్దతు ఉండటం కొంత సానుకూల అంశం. అయినప్పటికీ 2026 నాటికి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. ఇది రవాణా, ఉత్పత్తి ఖర్చులను పెంచి, సామాన్యులపై ద్రవ్యోల్బణ భారాన్ని మోపుతుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న దేశాల ఆర్థిక లోటు పెరిగే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ (IMF) హెచ్చరిస్తోంది. ప్రపంచ దేశాలు సంక్షోభంలో ఉన్నప్పటికీ, భారతదేశం మాత్రం బలమైన పునాదులతో ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేయడం దీనికి నిదర్శనం.

Read Also: Petrol Prices Hike: 2027 వరకు తగ్గని పెట్రోల్ ధరలు.. అమెరికా ఇంధన మంత్రి కీలక వ్యాఖ్యలు!

 Iran-America War

Iran-America War: జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వేసవి ఎల్ నినో సంభవిస్తే..

గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా భారత్ 9 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. కాబట్టి, ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని నివేదిక భరోసా ఇస్తోంది. భారతదేశంలో వసంతకాలపు Super El Nino (ఫిబ్రవరి-మే) సమయంలో దేశంలోని సుమారు 30% ప్రాంతాల్లో సాధారణం కంటే సగటున 26% తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అదే సమయంలో, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వేసవి ఎల్ నినో సంభవిస్తే, దేశంలోని దాదాపు 15% ప్రాంతాల్లో సగటున 22% తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది.ఈ వివరాలు 2024 డిసెంబర్ 11న లోక్‌సభలో శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఎల్ నినో ప్రభావం సమయంలో భారతదేశ నైరుతి రుతుపవనాలు సాధారణంగా బలహీనపడతాయని, దాని తీవ్రత ఎల్ నినో బలంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హర్మూజ్‌పై ఇరాన్ ఉక్కుపిడికిలి: అంతర్జాతీయ నౌకాయానానికి కొత్త సవాళ్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha