Dailyhunt
ఇరాన్ యుద్ధంతో భారత ఫారెక్స్ రిజ్వర్వులపై భారీ ప్రభావం

ఇరాన్ యుద్ధంతో భారత ఫారెక్స్ రిజ్వర్వులపై భారీ ప్రభావం

వార్త 2 weeks ago

శ్చిమాసియాలో ముఖ్యంగా ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ముడి చమురు, సహజ వాయువు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడే భారతదేశంపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది.

చమురు ధరల పెరుగుదల దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచడమే కాకుండా.. భారత రూపాయి విలువపై, దేశ విదేశీ మారక నిల్వలపై (Forex Reserves) ఊహించని ఒత్తిడిని తీసుకువచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే భారతదేశ విదేశీ మారక నిల్వలు 728 బిలియన్ డాలర్ల నుండి 688 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే సుమారు 40 బిలియన్ డాలర్ల నిల్వలు హరించుకుపోయాయి. మార్చి 27, 2026తో ముగిసిన వారంలో దేశ మొత్తం నిల్వలు 10.288 బిలియన్ డాలర్లు తగ్గి 688.058 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీనికి ముందు వారంలో కూడా 11.413 బిలియన్ డాలర్ల తగ్గుదల నమోదు కావడం గమనార్హం. ఫిబ్రవరి 27, 2026 నాటికి 728.494 బిలియన్ డాలర్ల సర్వకాలిక గరిష్ఠ స్థాయిలో ఉన్న నిల్వలు.. యుద్ధం కారణంగా వరుసగా రెండు వారాల పాటు భారీ క్షీణతను చూశాయి.

Read Also: US Iran Conflict: అమెరికా పైలట్ మాకు చిక్కాడు.. ఇరాన్

 Iran-USA War

Iran-USA War: అంతర్జాతీయ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు

నిల్వల తగ్గుదలకు ప్రధాన కారణాలను చూసినట్లయితే.. భారత విదేశీ మారక నిల్వల్లోని వివిధ విభాగాలు ఈ కాలంలో ఒత్తిడికి లోనయ్యాయి. రిజర్వులలో అతిపెద్ద భాగమైన ఎఫ్.సి.ఏ (FCA) 6.622 బిలియన్ డాలర్లు తగ్గి 551.072 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల వల్ల బంగారు నిల్వల విలువ కూడా వారం వ్యవధిలో 3.666 బిలియన్ డాలర్లు తగ్గి 113.521 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో వీటి విలువ సుమారు ₹11.75 లక్షల కోట్లుగా ఉంది. ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్ కుదేల్.. ఇది రూపాయి విలువను పాతాళానికి నెట్టే ప్రమాదం ఉండటంతో, రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్‌బిఐ తన వద్ద ఉన్న డాలర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించింది. ఈ వ్యూహాత్మక జోక్యం వల్లే Forex Reserves తగ్గినప్పటికీ, రూపాయి విలువ స్థిరంగా ఉండగలిగింది. ఆర్‌బిఐ తీసుకున్న సత్వర చర్యల వల్ల రూపాయి రికార్డు స్థాయి నుండి తిరిగి కోలుకోవడం విశేషం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha