Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్-అమెరికా ఒప్పందంతో తెరుచుకున్న హార్ముజ్ జలసంధి

ఇరాన్-అమెరికా ఒప్పందంతో తెరుచుకున్న హార్ముజ్ జలసంధి

వార్త 2 weeks ago

LNG Carrier Disha: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం పశ్చిమాసియాలో సానుకూల మార్పులకు దారితీసింది. అధికారికంగా సంతకాలు ఇంకా కాకపోయినప్పటికీ, ఇరు దేశాల అవగాహన మేరకు వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకల కోసం పూర్తిగా తెరిచారు.

దీంతో గత మూడు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణా తిరిగి ప్రారంభమైంది. హార్ముజ్ జలసంధి తెరుచుకున్న అనంతరం భారతదేశానికి చెందిన 'దిశ' (LNG carrier Disha) అనే భారీ ద్రవీకృత సహజ వాయువు (LNG) నౌక విజయవంతంగా ఆ ప్రాంతాన్ని దాటింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరియు యుద్ధ వాతావరణం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ జలసంధిని దాటిన మొట్టమొదటి పూర్తి స్థాయి భారతీయ నౌక ఇదే కావడం విశేషం. మూడు నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ నౌక సురక్షితంగా బయటపడిందని భారత నౌకారవాణ మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది.

Read Also: Smriti Mandhana: ప్రతిష్ఠాత్మక 'టైమ్ మ్యాగజైన్' జాబితాలో క్రికెటర్ స్మృతి మంధాన!

 LNG Carrier Disha

LNG Carrier Disha జూన్ 18న గుజరాత్ తీరానికి చేరనున్న చమురు నౌక

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ ‘దిశ’ నౌకలో 62,370 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జీ నిల్వలు ఉన్నట్లు కేంద్ర జలవనరులు, షిప్పింగ్, పోర్టుల శాఖ డైరెక్టర్ ఒపేష్ కుమార్ శర్మ వెల్లడించారు. ప్రస్తుతం సురక్షితంగా ప్రయాణిస్తున్న ఈ నౌక జూన్ 18న గుజరాత్ తీరంలోని దహేజ్ పోర్టుకు చేరుకోనుందని ఆయన స్పష్టం చేశారు. గత మూడు నెలలుగా హార్ముజ్ జలసంధి వద్ద అనేక భారతీయ చమురు నౌకలు, సిబ్బంది చిక్కుకుపోయారు. సముద్రంపై చిక్కుకున్న భారతీయుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం దౌత్యపరమైన సంప్రదింపులు జరిపింది. నౌకల సిబ్బంది, వారి కుటుంబాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 12,700 ఫోన్ కాల్స్, 28,000 ఈ-మెయిల్స్ ద్వారా సేవలు అందించారు. ప్రస్తుతం వివిధ నౌకల్లో 3,587 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, హార్ముజ్ పూర్తిగా తెరుచుకోవడంతో మిగిలిన నౌకలు కూడా త్వరలోనే సురక్షితంగా భారతదేశానికి చేరుకుంటాయని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. మెడికల్ షాపులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha