Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్‌కు రష్యా రహస్య ఆయుధ సరఫరా?

ఇరాన్‌కు రష్యా రహస్య ఆయుధ సరఫరా?

వార్త 3 months ago

Russia Iran: పశ్చిమ ఆసియాలో (Middle East) యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, రష్యా-ఇరాన్ మధ్య సాగుతున్న రహస్య ఒప్పందాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

రష్యా రహస్యంగా ఇరాన్‌కు భారీ ఎత్తున డ్రోన్‌లు, ఆయుధాలు, మందులు, ఆహార సరఫరాలు పంపుతోందని పాశ్చాత్య నిఘా సంస్థలు సంచలన ఆరోపణలు చేశాయి. ఒకవేళ ఇవి నిజమైతే, ప్రస్తుత సంఘర్షణలో ఇరాన్‌కు రష్యా నేరుగా సైనిక సహాయం అందించడం ఇదే మొదటిసారి అవుతుంది.నివేదికల ప్రకారం ఫిబ్రవరి చివరలో టెహ్రాన్‌పై దాడుల అనంతరం,ఇప్పటికే ఉపగ్రహ డేటా, లక్ష్య నిర్ధారణ వంటి నిఘా సహాయం అందించిన రష్యా, ఇప్పుడు మరింత ముందుకు వెళ్లిందని ఆరోపణలు సూచిస్తున్నాయి.

Read Also:Iran War: రష్యా చమురుతో ఉన్న టర్కీ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి

 Russia Iran Secret Drone Supply Conflict

ఆరోపణలను ఖండించిన క్రెమ్లిన్ – మానవతా సహాయంపై క్లారిటీ

అయితే ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్, ఇవి నకిలీ వార్తలు అని పేర్కొన్నారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని అంగీకరించినప్పటికీ, సైనిక సరఫరాల అంశాన్ని పూర్తిగా తిరస్కరించారు. ఇదిలా ఉండగా రష్యా మానవతా సహాయం అందిస్తున్నట్లు ధృవీకరించింది. అజర్‌బైజాన్ మార్గంగా 20 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని పంపినట్లు తెలిపింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయాన్ని కొనసాగిస్తామని పేర్కొంది.ప్రస్తుతం జరుగుతున్న ఈ సంఘర్షణలో ఇరాన్ డ్రోన్ వినియోగం కీలకంగా మారింది. తక్కువ ఖర్చుతో భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగల ఈ డ్రోన్‌లు యుద్ధ వ్యూహాన్ని మార్చుతున్నాయి.

మరోవైపు స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ వద్ద అంతరాయం కారణంగా ప్రపంచ చమురు సరఫరాలు దెబ్బతినడం, రష్యా చమురుకు డిమాండ్ పెరగడం వంటి పరోక్ష లాభాలు మాస్కోకు కలుగుతున్నాయి. ఇరాన్ రష్యా నుండి ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలను కూడా కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎస్-400 వంటి కీలక వ్యవస్థల సరఫరాపై ఇంకా స్పష్టత లేదు. మొత్తంగా ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. రష్యా పాత్ర స్పష్టమైతే, ఈ సంఘర్షణ అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్ చమురు కొనుగోలు వార్తలను ఖండించిన రిలయన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha