Trump Iran Warning: ప్రపంచ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌కు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.
అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో ఇరాన్ గనుక అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే, ఆ దేశం ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Read Also:Iran-USA War: ఇరాన్‌లోని బుషెహర్ అణు కేంద్రం సమీపంలో క్షిపణి దాడి..ఒకరు మృతి
Trump Iran Warning: 48 గంటల్లో ప్రళయం తప్పదు!
తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ట్రంప్ గతంలో ఇచ్చిన పది రోజుల గడువు దగ్గరపడిందని ఆయన గుర్తు చేశారు. సమయం మించిపోతోందని, విధ్వంసానికి 48 గంటల సమయమే ఉందని హెచ్చరించాడు. అంతా భగవంతుడి దయ! అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేయడం సంచలనంగా మారింది.
US-Iran Tensions
అయితే అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించటం లేదు. ఇరాన్ అమెరికా ప్రతిపాదనలను అవాస్తవాలు, అతిశయాలుగా పేర్కొంటూ వాటిని తిరస్కరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓవైపు దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తూనే.. మరోవైపు అమెరికా అదనపు బలగాలను మోహరిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.ట్రంప్ హెచ్చరికలతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. యుద్ధం కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న ఇరాన్ చమురు ఎగుమతులపై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

