Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం!

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం!

వార్త 2 months ago

Donald Trump Warning Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తన గళాన్ని వినిపించారు. ఇరాన్ రేవులకు వెళ్లే నౌకలను అడ్డుకునేలా అమెరికా సైన్యం 'నాకాబందీ' (దిగ్బంధం) ప్రారంభించిన నేపథ్యంలో, ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఇరాన్ ప్రభుత్వానికి బహిరంగ హెచ్చరిక జారీ చేశారు.

Read Also: Hormuz strait tension : హార్మూజ్ జలసంధి వద్ద హైటెన్షన్

ఇరాన్ నౌకాదళం నాశనం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ నావికాదళం ఇప్పటికే సముద్ర గర్భంలో కలిసిపోయిందని, వారి నౌకాబలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ట్రంప్ పేర్కొన్నారు. తాము ఇప్పటికే ఇరాన్‌కు చెందిన 158 నౌకలను నాశనం చేశామని, అవి సముద్రంలో మునిగిపోయాయని ఆయన వెల్లడించారు. “ఒకవేళ ఇరాన్ వేగవంతమైన దాడి నౌకలు మా దిగ్బంధం దగ్గరికి వస్తే, వాటిని క్షణాల్లో తుత్తునియలు చేస్తాం. మా చర్య చాలా వేగంగా, అత్యంత కఠినంగా ఉంటుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు.

 Donald Trump Warning Iran

Donald Trump Warning Iran: అసలు లక్ష్యం ఏంటి?

ఇరాన్ చమురు విక్రయాలను (Oil Trade) పూర్తిగా స్తంభింపజేయడమే ఈ నాకాబందీ ప్రధాన ఉద్దేశమని ట్రంప్ వివరించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) నివేదిక ప్రకారం:

  • ఇరాన్ తీర ప్రాంతాలకు వెళ్లే అన్ని దేశాల నౌకలను నిలిపివేసి తనిఖీ చేస్తారు.
  • ఇతర దేశాల సాధారణ రవాణాకు, వాణిజ్యానికి ఎలాంటి ఆటంకం కలిగించబోమని సెంటకామ్ స్పష్టం చేసింది.
  • ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీయడం ద్వారా ఆ దేశాన్ని చర్చలకు తీసుకురావడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. తమ నౌకలను అడ్డుకుంటే, గల్ఫ్ ప్రాంతంలోని పొరుగు దేశాల ఓడరేవులపై దాడులు చేస్తామని తేహ్రాన్ హెచ్చరించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సుప్రీం కోర్టు కీలక తీర్పు,34 లక్షల ఓటర్లకు బిగ్ షాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha