US Sanctions On Iran : ఇరాన్ ఆర్థిక వనరులపై దెబ్బకొట్టే లక్ష్యంతో అమెరికా కొత్తగా 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్' పేరిట కఠిన చర్యలు చేపడుతోంది.
చైనాతో పాటు ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఇతర దేశాలపై కూడా ఈ ఆంక్షల ప్రభావం పడనుండటంతో అంతర్జాతీయ దౌత్య రంగాన ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ చమురును కొనుగోలు చేస్తూ, టెహ్రాన్ ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరిస్తున్న ఏ దేశం లేదా సంస్థ అయినా ఆంక్షల నుంచి తప్పించుకోలేదని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురులో దాదాపు 90 శాతాన్ని చైనానే కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో చైనా బ్యాంకులు మరియు సంస్థలపై అమెరికా పరోక్షంగా ఒత్తిడి పెంచుతోంది.చైనా అధ్యక్షుడు జిన్ ప్లాన్ చేసిన అమెరికా పర్యటన మరియు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరగనున్న కీలక సమావేశానికి ముందు ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా బెదిరింపులను తమ వాణిజ్య భాగస్వాములు ఎవరూ పట్టించుకోరని, వేరే దేశాలపై ఆంక్షలు విధించే స్థితిలో అమెరికా లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబఫ్ సమాధానమిచ్చారు.
Read Also: Wheat Product : గోధుమల ఎగుమతిపై నిషేధం తొలగింపు..!
US Sanctions On Iran
US Sanctions On Iran : జిన్‌పింగ్ అమెరికా పర్యటన వేళ
సెప్టెంబర్ 24న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన సమావేశమై వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపనున్నారు. ఈ కీలక భేటీకి కొద్ది రోజుల ముందు ఈ పరిణామాలు జరగడం దౌత్యాపరంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇరాన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ఏకపక్షంగా విరుచుకుపడే బదులు, ముందుగా దౌత్యపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు బెస్సెంట్ వెల్లడించారు. తాము ఏ దేశంతోనైనా దౌత్యం ద్వారానే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

