Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఇరుముడి'పై వివాదం.. మంత్రి లోకేశ్‌కు ఎమ్మెల్సీ ఫిర్యాదు

'ఇరుముడి'పై వివాదం.. మంత్రి లోకేశ్‌కు ఎమ్మెల్సీ ఫిర్యాదు

వార్త 3 weeks ago

Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకుపోతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, తొలి నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం రెండో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే, ఈ కమర్షియల్ సక్సెస్ ఒకవైపు ఆనందాన్ని ఇస్తుంటే, మరోవైపు సినిమాలోని కొన్ని సన్నివేశాలు తీవ్రమైన వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి.

ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత

సినిమాలో ప్రభుత్వ పాఠశాలలను, ఉపాధ్యాయ వృత్తిని కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా అనేది సమాజంపై తీవ్ర ప్రభావం చూపే శక్తిమంతమైన మాధ్యమమని, అలాంటి మాధ్యమం ద్వారా ప్రభుత్వ బడులపై తప్పుడు సంకేతాలు పంపడం సరికాదని ఏపీటీఎఫ్ నేతలు చెన్నుపాటి మంజుల మరియు బసవలింగారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రతిష్టను మంటగలిపేలా ఉన్న ఆయా సన్నివేశాలను వెంటనే సినిమా నుంచి తొలగించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు గట్టిగా డిమాండ్ చేశారు.

Irumudi Movie: రాజకీయ రంగ ప్రవేశం - విద్యాశాఖ మంత్రికి లేఖ

ఈ వివాదం ఇప్పుడు కేవలం సంఘాల నిరసనలకే పరిమితం కాకుండా రాజకీయ రంగు పులుముకుంది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీ మూర్తి భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పట్ల అనుచితంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ బడుల గౌరవానికి భంగం కలిగించే ఈ దృశ్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు అధికారికంగా లేఖ రాశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని చిత్ర యూనిట్‌తో చర్చలు జరిపి, ఆ అభ్యంతరకర సన్నివేశాలను శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వివాదానికి అసలు కారణం ఏంటి?

ఈ మొత్తం వివాదానికి అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గ పరిధిలోని సీలేరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు సంబంధించిన కొన్ని దృశ్యాలు కారణమయ్యాయి. ఆ స్కూల్ పేరు స్పష్టంగా కనిపించే బోర్డును చూపించడంతో పాటు, విద్యార్థినులను వారి అధికారిక డ్రెస్ కోడ్‌లో చిత్రీకరించారు. అంతేకాకుండా, అక్కడి ప్రధానోపాధ్యాయురాలి పాత్రను అత్యంత ప్రతికూలంగా చూపించడంపై ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు చిత్రం కలెక్షన్లతో దూసుకుపోతుండగా, ఈ వివాదంపై చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తుందనేది ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

పాతాళానికి పడిపోయిన టాక్సిక్ కలెక్షన్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha