Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇషాన్ కిషన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న CSK ఫ్యాన్స్

ఇషాన్ కిషన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న CSK ఫ్యాన్స్

వార్త 2 months ago

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయం సాధించిన తర్వాత ఇషాన్ కిషన్ చేసిన అతి ప్రవర్తన ఇప్పుడు అతనికే శాపంగా మారింది.

ఆ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలిచిన ఆనందంలో ఇషాన్ కిషన్ చెన్నై అభిమానుల హోమ్ గ్రౌండ్‌లోనే వారిని ఉద్దేశించి ‘విజిల్ పోడు’ అంటూ వెటకారంగా విజిల్ వేయడమే కాకుండా, స్టేడియం ఖాళీ చేసి వెళ్ళిపోండంటూ చేతులతో సంజ్ఞలు చేశాడు. ఆ సమయంలో తీవ్రంగా హర్ట్ అయిన చెన్నై ఫ్యాన్స్ సరైన సమయం కోసం వేచి చూశారు. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించడంతో, సీఎస్‌కే ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఇషాన్ కిషన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. “అతి సర్వత్రా వర్జయేత్” అంటూ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.

Read Also : వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్

ఇషాన్ కిషన్‌కు నెటిజన్ల చురకలు

చెన్నై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఇషాన్ కిషన్ పాత వీడియోలను, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను షేర్ చేస్తూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. “క్రికెట్‌లో గెలిచినా, ఓడినా ఒదిగి ఉండాలనే కనీస క్రీడా స్ఫూర్తిని నేర్చుకో. నాడు మాకు హోమ్ గ్రౌండ్‌లో ఇల్లు చూపెట్టావు కదా, ఇప్పుడు మీ టీమ్ ఎలిమినేటర్ లోనే ఓడిపోయింది.. మరి ఇప్పుడు నువ్వు లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్తున్నావుగా” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మైదానంలో దూకుడు ప్రదర్శించడం వేరని, అభిమానులను అవమానించేలా ప్రవర్తిస్తే కాలమే సమాధానం చెబుతుందంటూ క్రికెట్ లవర్స్ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ టోర్నీ నుండి వైదొలగడంతో ఇషాన్ కిషన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ రివెంజ్ ట్రోల్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బుడ్డోడి ఎఫెక్ట్..హైదరాబాద్‌పై 47 పరుగులతో ఘనవిజయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha