Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇషాన్ కిషన్, పంత్ రికార్డులు బ్రేక్.. సెంచరీల రారాజుగా సంజు శాంసన్

ఇషాన్ కిషన్, పంత్ రికార్డులు బ్రేక్.. సెంచరీల రారాజుగా సంజు శాంసన్

వార్త 2 months ago

Sanju Samson creates history: ఐపీఎల్ 2026 సీజన్‌లో సంజు శాంసన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి మారిన తర్వాత సంజు ఫామ్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది.

ముంబై ఇండియన్స్‌పై వాంఖడే స్టేడియంలో సాధించిన ఈ మెరుపు సెంచరీ అతడిని భారత వికెట్ కీపర్-బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలబెట్టింది.

Read Also:IPL 2026 : హార్దిక్ కు ఏమైంది..? మరి ఇంత దారుణమా ?

భారత వికెట్ కీపర్లలో నంబర్ వన్

ముంబై ఇండియన్స్‌పై సాధించిన సెంచరీతో సంజు శాంసన్ టీ20 క్రికెట్‌లో తన 6వ శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు.

  • సంజు శాంసన్: 6 సెంచరీలు
  • ఇషాన్ కిషన్: 5 సెంచరీలు
  • రిషబ్ పంత్: 3 సెంచరీలు

మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా వికెట్ కీపర్లుగా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో క్వింటన్ డి కాక్ (9) మొదటి స్థానంలో ఉండగా, సంజు ఇప్పుడు భారత బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాడు.

 Sanju Samson overtakes Ishan Kishan and Rishabh Pant

Sanju Samson creates history: ఐపీఎల్ 2026లో భీభత్సం

రాజస్థాన్ రాయల్స్ నుండి చెన్నైకి ట్రేడ్ అయిన సంజు, ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు.

  • సీజన్ గణాంకాలు: కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లోనే 293 పరుగులు చేశాడు.
  • స్ట్రైక్ రేట్: 178.66 తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తున్నాడు.
  • సగటు: 58.6 గా ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఇది అతనికి 5వ సెంచరీ కావడం విశేషం. వికెట్ కీపర్‌గా ఐపీఎల్‌లో మూడు సెంచరీలు సాధించి డి కాక్ రికార్డును సమం చేశాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

జట్టు కోసమే ఆడాను.. సెంచరీ రివార్డ్‌గా వచ్చింది: సంజూ శాంసన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha