Sanju Samson: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. కేవలం 54 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
సంజూ విధ్వంసకర ఇన్నింగ్స్ ధాటికి సీఎస్‌కే 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడమే కాకుండా, ముంబైని వారి సొంత గడ్డపైనే చిత్తు చేసింది. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గాను ఆయనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Read Also:MI vs CSK live score: ముంబైపై చెన్నై గెలుపు.. ఐదో స్థానానికి చేరిన రుతురాజ్ సేన
వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యం
మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత సెంచరీ కంటే జట్టు విజయం సాధించడంపైనే ఎక్కువ ఆనందం వ్యక్తం చేశారు. “నేను ఎప్పుడూ జట్టు కోసమే ఆడతాను. అలా ఆడినప్పుడు సెంచరీ ఒక రివార్డ్‌లా లభించింది. వాంఖడే స్టేడియంలో ముంబైపై శతకం బాదడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది” అని ఆయన పేర్కొన్నారు. వరుసగా మూడు ఓటముల తర్వాత జట్టు ఇంతలా పుంజుకోవడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు.
పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్: సంజూ వ్యూహం
తొలుత బ్యాటింగ్ చేసిన సమయంలో ఎదురైన సవాళ్లను సంజూ విశ్లేషించారు. “ఆరంభంలో బంతి కాస్త ఆగుతూ వస్తోంది. పవర్ ప్లే తర్వాత మేము వరుసగా వికెట్లు కోల్పోయాము. ఆ సమయంలో సెట్ అయిన బ్యాటర్‌గా నేను చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆట పరిస్థితులను బట్టి మనం ఎలా ఆడాలో క్రికెట్టే మనకు నేర్పుతుంది. మాది యువ జట్టు, కానీ ప్రతి ఆటగాడు బాధ్యతాయుతంగా ఆడుతున్నారు” అని సంజూ వివరించారు.
Sanju Samson Century vs Mumbai Indians
వాంఖడేలో పసుపు మయం: ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ జరుగుతున్నా, అక్కడ సీఎస్‌కే జెర్సీలు ఎక్కువగా కనిపించడంపై సంజూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “వాంఖడేలో ఇంతలా పసుపు రంగు కనిపిస్తుండటం చాలా కొత్తగా ఉంది. అభిమానుల మద్దతు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. వచ్చే మ్యాచ్‌ల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.
Sanju Samson: చివరి బంతికి సెంచరీ
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓపెనర్ సంజూ శాంసన్ ముందుండి నడిపించాడు. మిగతా బ్యాటర్లు విఫలమవుతున్నా.. అతడు మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. తొలుత నిదానంగా బ్యాటింగ్ చేసిన అతడు.. ఆ తర్వాత టాప్ గేర్‌లో వచ్చాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్‌లో 6, 6, 4 కొట్టి చివరి బంతికి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మొత్తంగా 54 బంతుల్లో 101 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. సంజూ మినహా మరే బ్యాటర్ కూడా 25 రన్స్ కూడా చేయకపోవడం గమనార్హం. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఘజన్‌ఫర్, అశ్వనీ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ శాంట్నర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు వేసి 38 రన్స్ సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
పవర్ ప్లేనే మా పతనాన్ని శాసించింది: హార్దిక్ పాండ్యా విశ్లేషణ

