Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇస్లామాబాద్ చర్చలకు రంగం సిద్ధం..జేడీ వాన్స్ నాయకత్వం

ఇస్లామాబాద్ చర్చలకు రంగం సిద్ధం..జేడీ వాన్స్ నాయకత్వం

వార్త 2 months ago

ప్రపంచాన్ని గజగజలాడించిన అమెరికా, ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక అడుగు పడింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఈ వారాంతంలో జరగబోయే చారిత్రాత్మక శాంతి చర్చల కోసం తన ప్రతినిధుల బృందాన్ని డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలోనే ఈ చర్చలు జరుగుతాయని.. గురువారం రోజే ఈ బృందం పాకిస్థాన్‌కు బయలుదేరనున్నట్లు స్పష్టం చేశారు.

Read Also: Israel Lebanon Attacks: లెబనాన్ పై విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్

 Iran-USA War

Iran-USA War: హేమాహేమీలతో కూడిన అమెరికా బృందం

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ కీలక వివరాలను వెల్లడించారు. ట్రంప్ కుడి భజమైన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఈ చర్చల బాధ్యతలు అప్పగించారని ఆమె తెలిపారు. వాన్స్‌తో పాటు అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ కూడా ఈ చర్చల్లో పాల్గొంటారని ధృవీకరించారు. “మొదటి విడత చర్చలు శుక్రవారం రోజు ఉదయం స్థానిక కాలమానం ప్రకారం ప్రారంభం అవుతాయి. ప్రత్యక్ష చర్చల ద్వారా ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం” అని లీవిట్ పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇప్పటికే ఈ చర్చల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఇరాన్ బృందానికి పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ నాయకత్వం వహించనున్నారు. యుద్ధ సమయంలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో గాలిబాఫ్ కీలక పాత్ర పోషించారు, కాబట్టి చర్చల వేదికపై ఆయన రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. ఏప్రిల్ 10న ప్రారంభం అయ్యే ఈ దౌత్య ప్రక్రియలో ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖిగా కూర్చుని చర్చించనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

భారత్, బంగ్లాదేశ్ మధ్య మళ్ళీ చిగురిస్తున్న మైత్రి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha