Dailyhunt
లెబనాన్ పై విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్

లెబనాన్ పై విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్

వార్త 1 week ago

Israel Lebanon Attacks: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఊహించని స్థాయిలో విరుచుకుపడ్డాయి.

కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే లెబనాన్ వ్యాప్తంగా వందకు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘోర కలికాలంలో ఇప్పటివరకు 254 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: JD Vance Lebanon Comments: లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదు: జేడీ వాన్స్

 Israel wreaked havoc on Lebanon

Israel Lebanon Attacks: 1982 తర్వాత అతిపెద్ద దాడి

ఇజ్రాయెల్ జరిపిన ఈ మెరుపు దాడులు లెబనాన్ రాజధాని బీరుట్ (Beirut), వ్యూహాత్మక ప్రాంతమైన బెక్కా వ్యాలీ (Bekaa Valley) తో పాటు దక్షిణ లెబనాన్‌లోని పలు నగరాలను అతలాకుతలం చేశాయి. హిజ్బుల్లా (Hezbollah) స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ, బాంబుల దాటికి పెద్ద ఎత్తున నివాస భవనాలు నేలమట్టమయ్యాయి. చరిత్రకారుల ప్రకారం.. 1982 లెబనాన్ యుద్ధం తర్వాత ఆ దేశంపై ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద మరియు అత్యంత విధ్వంసకర దాడి ఇదే కావడం గమనార్హం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్ కోరికలను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha