Dailyhunt
ఇస్లామాబాద్ వేదికగా ఏప్రిల్ 10న శాంతి చర్చలు

ఇస్లామాబాద్ వేదికగా ఏప్రిల్ 10న శాంతి చర్చలు

వార్త 3 weeks ago

USA Iran Ceasefire :ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. ఇరు దేశాలు తక్షణమే అమల్లోకి వచ్చేలా సంపూర్ణ కాల్పుల విరమణకు (Immediate Ceasefire) అంగీకరించాయని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.

ఈ నిర్ణయం అమెరికా, ఇరాన్‌తో పాటు లెబనాన్ ,ఇతర యుద్ధ ప్రభావిత ప్రాంతాలన్నింటికీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ చారిత్రాత్మక పరిణామం గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు మార్గం సుగమం చేయనుంది.

Read Also:US Iran war ceasefire : మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకున్న పాకిస్తాన్?

షెహబాజ్ షరీఫ్ ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. “అత్యంత వినయంతో నేను ఒక శుభవార్తను తెలియజేస్తున్నాను. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తమ మిత్రదేశాలతో కలిసి లెబనాన్, ఇతర ప్రాంతాలతో సహా అన్నిచోట్లా తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ వివేకవంతమైన చర్యను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇరు దేశాల నాయకత్వానికి నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని తెలిపారు.

USA Iran Ceasefire: ట్వీట్‌లో చిన్న పొరపాటు.. సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్

పాక్ ప్రధాని చేసిన ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన ఈ ట్వీట్‌ను కాపీ పేస్ట్ చేశారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తున్నారు. ముందుగా ట్వీట్ చేసిన షెహబాజ్ షరీఫ్.. పాకిస్థాన్ ప్రధాని ఎక్స్ మెసేజ్ (డ్రాఫ్ట్ – పాకిస్థాన్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స్) అని రాసి ఉండగా దాన్ని గమనించకుండా పోస్ట్ చేశారు.

ఇది చూసిన వారంతా దాన్ని స్క్రీన్ షాట్లు తీసుకున్నారు. కానీ ఆ తర్వాత మూడు నిమిషాలకే పాక్ ప్రధాని సదరు ట్వీట్‌ను మళ్లీ ఎడిట్ చేశారు.కాపీ పేస్ట్ చేసినట్లుగా కనిపిస్తున్న పదాలను తొలగించి.. తాను రాసినట్లుగా ఉన్న మెసేజ్‌ను ఉంచారు. వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తూనే.. నెటిజెన్లు ఆయన్ను ఓ ఆట ఆడుకుంటున్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి కనీసం ఒక ట్వీట్‌ను కూడా సరిగ్గా పోస్ట్ చేయలేకపోతే.. ఆయన దేశాన్ని ఎలా పరిపాలిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మరో రెండేళ్ల పాటు గడ్డుకాలమేనా ? తీవ్ర కరువు తో అల్లాడాల్సిందేనా ? భయపెడుతున్న సైంటిస్టులు హెచ్చరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha