Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాకు చైనా బిగ్ షాక్: ఎన్విడియాపై నిషేధంతో మొదలైన 'చిప్ వార్'!

అమెరికాకు చైనా బిగ్ షాక్: ఎన్విడియాపై నిషేధంతో మొదలైన 'చిప్ వార్'!

వార్త 3 days ago

‘Chip War’: చైనా తన కస్టమ్స్ చెక్‌పాయింట్ల వద్ద ఎన్విడియాకు చెందిన RTX 5090D V2 చిప్‌ను నిషేధిత వస్తువుల జాబితాలో చేర్చడం అంతర్జాతీయ టెక్ ప్రపంచంలో ఒక పెద్ద సంచలనంగా మారింది.

ఈ చర్య కేవలం ఒక సాధారణ వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్ రంగాలలో అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోరాటానికి ప్రత్యక్ష నిదర్శనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన.. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చైనా పర్యటనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రపంచ ఏఐ చిప్ పోటీపై కొత్త చర్చను రేకెత్తించింది. ఈ మలుపులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ RTX 5090D V2 చిప్‌ను ఎన్విడియా సంస్థ ప్రత్యేకంగా చైనా మార్కెట్ కోసమే రూపొందించింది.

Read Also: Mumbai Pav Price Hike: ముంబైలో పావ్ ధరల పెంపు.. సామాన్యుడి అల్పాహారానికి ఇక చుక్కలే!

 ‘Chip War’:

‘Chip War’: చైనా ఇకపై విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా..

అమెరికా విధించిన కఠినమైన ఎగుమతి నియంత్రణ నిబంధనలను దాటుకుంటూ.. చైనాలో చట్టబద్ధంగా విక్రయించడానికి వీలుగా గత సంవత్సరం ఆగస్టులో దీనిని విడుదల చేశారు. నిజానికి ఇది గేమర్‌లు, 3D యానిమేటర్లు, హై-ఎండ్ గ్రాఫిక్స్ వినియోగదారుల కోసం ఉద్దేశించిన గేమింగ్ చిప్ అయినప్పటికీ, దీనికి ఉన్న అపారమైన కంప్యూటింగ్ శక్తి కారణంగా చాలా మంది ఏఐ డెవలపర్లు కూడా ఏఐ మోడల్ శిక్షణ కోసం దీనిని ఉపయోగించడం ప్రారంభించారు. అయితే, అమెరికా ఆంక్షలను తట్టుకుని ఎన్విడియా ఈ చిప్‌ను చైనాకు తెచ్చినప్పటికీ, ఇప్పుడు చైనా ప్రభుత్వమే దీనిపై నిషేధం విధించడానికి ఒక బలమైన వ్యూహాత్మక కారణం ఉంది. చైనా ఇకపై విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా, తన దేశీయ చిప్‌మేకర్లయిన హువావే, కేంబ్రికాన్ వంటి కంపెనీలను బలోపేతం చేయాలని భావిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha