Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇవాళ నేషనల్ టెక్నాలజీ డే.. అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ఇవాళ నేషనల్ టెక్నాలజీ డే.. అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

వార్త 3 months ago

భారతదేశ చరిత్రలో మే 11 ఒక మరుపురాని రోజు. 1998లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్ వేదికగా భారత్ వరుసగా అణు పరీక్షలను నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలో జరిగిన ఈ ప్రయోగాలు దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టాయి. మన శాస్త్రవేత్తల ప్రతిభను చాటిచెప్పిన ఈ అద్భుత విజయానికి గుర్తుగా ప్రతి ఏటా ఈ రోజును జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

Read also: Udhayanidhi Stalin: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్

 India National Technology Day achievements

స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త ప్రయోగాలు

కేవలం అణు పరీక్షలు మాత్రమే కాకుండా అదే రోజున భారత్ మరికొన్ని ఘనతలు సాధించింది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘హంస-3’ విమానం తొలిసారి నింగిలోకి ఎగిరి చరిత్ర సృష్టించింది. దీనితో పాటు రక్షణ రంగంలో కీలకమైన త్రిశూల్ క్షిపణి పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పరిణామాలు సాంకేతిక రంగంలో భారత్ ఏ దేశానికీ తీసిపోదని ప్రపంచ దేశాలకు స్పష్టం చేశాయి.

శాస్త్రవేత్తల కృషికి నివాళి

సాంకేతిక రంగంలో మన దేశం స్వయం సమృద్ధి సాధించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. పగలు రేయి కష్టపడి దేశ కీర్తిని పెంచిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తల కృషిని గౌరవించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. నేటితరం విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి కలిగించేలా ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఆధునిక భారత్ నిర్మాణంలో సాంకేతికత పోషిస్తున్న పాత్రను ఈ రోజు మరోసారి గుర్తుచేస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రోజంతా అలసటగా అనిపిస్తుందా… అయితే ఇలా చేయండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha