Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాతీయ స్థాయిలో 'ఆకాశ్' రికార్డు.. తెలంగాణ విద్యార్థుల అద్భుత ప్రదర్శన

జాతీయ స్థాయిలో 'ఆకాశ్' రికార్డు.. తెలంగాణ విద్యార్థుల అద్భుత ప్రదర్శన

వార్త 1 week ago

Aakash Educational Services Limited (AESL) : దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల్లో ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) తన విజయ పరంపరను కొనసాగిస్తూ దేశంలోనే అత్యంత విశ్వసనీయ సంస్థగా తన స్థానాన్ని మరోసారి నిరూపించుకుంది.

జాతీయ స్థాయిలో ఆకాశ్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా టాప్ 100 ర్యాంకుల్లో ఏకంగా 9 స్థానాలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మోహిత్ శేఖర్ శుక్లా 319 మార్కుల అసాధారణ స్కోరుతో ఆల్ ఇండియా 4వ ర్యాంకు (AIR 4) సాధించి రాష్ట్ర టాపర్‌గా నిలిచాడు. మోహిత్‌తో పాటు జాతీయ స్థాయిలో టాప్ 100లో నిలిచిన ఇతర ఆకాశ్ విద్యార్థులు AIR 17, 35, 42, 52, 59, 63, 86, మరియు 94 ర్యాంకులతో సంస్థ విద్యా ప్రమాణాల స్థాయిని చాటారు. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశ్ సంస్థ నుండి ఇద్దరు విద్యార్థులు టాప్ 100 లోపు, ముగ్గురు టాప్ 200 లోపు మరియు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా 1000 లోపు ఉత్తమ ర్యాంకులను సాధించి రాష్ట్ర కీర్తిని పెంచారు. తెలంగాణకు చెందిన జయంత్ శేఖర్ (AIR 94), హంజాలా అబెదీన్ (AIR 105), శివ తేజంషు (AIR 374), ఆలమూరి చైతన్య (AIR 634) వంటి విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఈ ఘన విజయంలో భాగస్వాములయ్యారు.

Read Also : మే నెలలో రికార్డు స్థాయిలో మారుతి సేల్స్

మూడేళ్లుగా నిలకడైన వృద్ధి.. విజయంపై అకడమిక్ హెడ్ హర్షం

జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలో రాణించడానికి ఆకాశ్ సంస్థ అందించిన కాన్సెప్చువల్ క్లారిటీ, నిరంతర మాక్ టెస్టులు, క్వాలిటీ స్టడీ మెటీరియల్ మరియు ఉపాధ్యాయుల విశ్లేషణాత్మక బోధనే తమ విజయానికి కారణమని ర్యాంకర్లు కృతజ్ఞతలు చాటారు. విద్యార్థుల అద్భుత ప్రతిభపై ఆకాశ్ (AESL) చీఫ్ అకడమిక్ & బిజినెస్ హెడ్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా స్పందిస్తూ.. విద్యార్థుల క్రమశిక్షణ, అంకితభావం మరియు రాణించాలనే పట్టుదలే ఈ విజయానికి పునాది అని అభినందించారు. గత మూడేళ్ల (2024-2026) ఆకాశ్ ఫలితాలను విశ్లేషిస్తే సంస్థ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2024, 2025 లలో టాప్-10 లో ఒక్క ర్యాంకు కూడా లేనప్పటికీ, 2026లో AIR 4వ ర్యాంకు సాధించడం విశేషం. అలాగే టాప్-50 కేటగిరీలో విద్యార్థుల సంఖ్య 2024లో 1 నుండి 2026 నాటికి 5కు పెరిగింది. అదేవిధంగా, టాప్-100 సాధించిన వారు 11 మందికి, అత్యంత కీలకమైన టాప్-200 కేటగిరీలో విద్యార్థుల సంఖ్య 2024లో 13 ఉండగా, 2026 నాటికి ఏకంగా 25కు పెరగడం ఆకాశ్ విద్యా విధానం సాధిస్తున్న అప్రతిహత పురోగతికి నిదర్శనంగా నిలుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మే నెలలో రికార్డు స్థాయిలో UPI పేమెంట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha