Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికైన కామారెడ్డి టీచర్

జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికైన కామారెడ్డి టీచర్

వార్త 0 months ago

National Best Teacher Award: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఎంపీపీ గర్ల్స్‌ ప్రైమరీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న భవాని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా విద్యాశాఖ ఎంపిక చేసిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి స్థానం సంపాదించిన ఏకైక ఉపాధ్యాయురాలు భవాని కావడం విశేషం. వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

Read Also : Khajaguda Road Accident: పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ ప్రమాదం..బెంగాల్ యువకుడు దుర్మరణం!

 Kamareddy teacher selected for National Best Teacher Award

National Best Teacher Award: నృత్య రూపకాలు, సృజనాత్మక బోధనలో భవాని ప్రత్యేకత

సాంప్రదాయ రీతిలో పుస్తకాలలోని పాఠాలను చదివించి పరీక్షలకు సిద్ధం చేయడం కంటే, విద్యార్థులు స్వయంగా నేర్చుకునేలా ‘యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌’కు (ఆట పాటలతో కూడిన విద్య) భవాని అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. క్లిష్టంగా ఉండే పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా చేయడానికి నృత్య రూపకాలు, పాటలు, వినూత్న కార్యకలాపాలను ఉపయోగిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులు చేపడే వివిధ సృజనాత్మక కార్యక్రమాలను రికార్డు చేసి ప్రత్యేక యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందుబాటులో ఉంచుతూ పిల్లల్లో ప్రోత్సాహాన్ని నింపుతున్నారు. దీనివల్ల విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు, ఇతర ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం లభిస్తోంది.

ఫిన్లాండ్ విద్యా విధానం అమలు.. అవార్డు ఎంపిక

ఇటీవల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఫిన్లాండ్‌ పర్యటనకు వెళ్లిన 40 మంది ఉపాధ్యాయుల బృందంలో భవాని భాగమయ్యారు. అక్కడి ఆధునిక విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, ఆ వినూత్న అంశాలను తన పాఠశాలలోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చి అమలు చేస్తున్నారు. గతేడాది కూడా ఈ పురస్కారానికి ఆమె పేరు ప్రతిపాదించినప్పటికీ, ఈసారి నిర్వహించిన నేషనల్ ఇంటర్వ్యూల్లో తన బోధనా వైవిధ్యం, విద్యార్థుల కోసం చేపట్టిన ప్రయోగాలను సమర్థంగా వివరించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.

అపోహలు నమ్మవద్దు.. రోడ్డు ప్రమాదంపై ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు వివరణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha