Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ ప్రమాదం..బెంగాల్ యువకుడు దుర్మరణం!

పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ ప్రమాదం..బెంగాల్ యువకుడు దుర్మరణం!

వార్త 0 months ago

Khajaguda Road Accident: హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సహస్ర ఛటోపాధ్యాయ (25), అభిజిత్ సింగ్ (25), అబ్బాస్ సిద్దిక్ (25) అనే ముగ్గురు స్నేహితులు ఒకే బైక్‌పై (WB 26 BM 2608) ఖజాగూడ నుంచి అంజయ్య నగర్ వైపు వెళ్తున్నారు.

Read Also :Vizianagaram Crime: మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య!

Khajaguda Road Accident: అతివేగమే ప్రమాదానికి కారణం.. కేర్ హాస్పిటల్‌లో బాధితులకు చికిత్స

శనివారం తెల్లవారుజామున సుమారు 4:45 గంటల సమయంలో ESI 2వ గేట్ సమీపంలో కేర్ హాస్పిటల్ ప్రధాన రహదారి వైపు మలుపు తిరుగుతున్న క్రమంలో, తీవ్రమైన వేగం కారణంగా బైక్ నడుపుతున్న వ్యక్తి వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బైక్ తీవ్రస్థాయిలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

ఈ ఘోర ప్రమాదంలో బైక్ చివరన కూర్చున్న అబ్బాస్ సిద్దిక్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్ నడుపుతున్న సహస్ర ఛటోపాధ్యాయతో పాటు మధ్యలో కూర్చున్న అభిజిత్ సింగ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బైక్ అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలవరం పరిధిలో లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha