Dailyhunt
జగన్ రాజకీయ అస్థిరతకు 'మావిగన్' ఒక కొత్త నాటకం: సత్యకుమార్ యాదవ్

జగన్ రాజకీయ అస్థిరతకు 'మావిగన్' ఒక కొత్త నాటకం: సత్యకుమార్ యాదవ్

వార్త 1 week ago

AP Politics: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ధోరణిపై ఘాటుగా స్పందించారు.

రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడిన రాజధాని అంశంలో స్థిరత్వం లేకుండా వ్యవహరించడం దురదృష్టకర మని మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతినే రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, అనంతరం మూడు రాజధానుల పేరుతో గందరగోళానికి తెరతీసి, ఇప్పుడు మావిగన్ అనే కొత్త భావనను ముందుకు తేవడం ఆయనలోని అస్థిరతకు నిదర్శనమని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు.

Read also: TG Politics: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

Minister Satyakumar Yadav Speech Image

AP Politics: ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం

మావిగన్ వంటి అసంబద్ధమైన ఆలోచనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని, ఇది రాష్ట్రాన్ని హాస్యాస్పదంగా మారుస్తోందని మంత్రి ఆక్షేపించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధానాలపై చర్చ జరుగుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దెబ్బతింటోందని పేర్కొన్నారు. మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి విమర్శించారు. విశాఖపట్నంలో రూ.500 కోట్ల ప్రజాధనంతో వ్యక్తిగత నిర్మించుకోవడం నివాసం తప్ప, ఒక్క పరిశ్రమ 1&PA 5500 దురదృష్టకరమన్నారు.

రాయలసీమ అభివృద్ధిపై నిర్లక్ష్యం

అదే విధంగా రాయలసీమకు జ్యుడీషియల్ సాగునీటి క్యాపిటల్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, హైకోర్టు తరలింపు లేదా బెంచ్ ఏర్పాటు పై కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందన్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా జగన్రెడ్డి విఫలమయ్యారని, ప్రాజెక్టులు, పరిశ్రమలు, మోలిక వసతులపై ఎటువంటి పురోగతి లేకపోవడం ప్రజలను నిరాశకు గురిచేసిందన్నారు. గండికోట నిర్వాసితు లకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయక పోవడం ఆయన పాలనలోని అసమర్థతను బయటపెడుతుందని మంత్రి విమర్శించారు.

అమరావతిపై కుట్రలు

ఇక అమరావతి నిర్మాణం వేగంగా సాగుతుండటాన్ని జీర్ణించుకోలేక, దానిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని మంత్రి ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha