TG Politics: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాష్ట్ర మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ పోస్టులు ఉన్నాయని ఆమె నోటీసులో పేర్కొన్నారు.
Read also: Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో నీటి కష్టాలు: ట్యాంకర్ల కోసం 72 గంటల నిరీక్షణ

Minister Seethakka issues notice to KCR
TG Politics: తప్పుడు ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలి
బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి ఆ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆరే బాధ్యత వహించాలని సీతక్క స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనపై బురద చల్లడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు.
48 గంటల గడువు.. లేదంటే కఠిన చర్యలు
సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టులను 48 గంటల్లోగా తొలగించి, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా స్పందించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్‌వాడీ ఫోన్ల కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, తప్పుడు వార్తలతో ప్రజలను పక్కదారి పట్టించవద్దని ఆమె నోటీసులో వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించండి.. హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి

