Gudapati Srinivasa Rao: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. రేపల్లెకు చెందిన ప్రముఖ తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నేత గూడపాటి శ్రీనివాసరావు అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గూడపాటిని పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు.

రేపల్లెలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: జగన్
గూడపాటి శ్రీనివాసరావును వైఎస్సార్‌సీపీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు జగన్ తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, భవిష్యత్తులో జరిగే రాజకీయ పోరాటాల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలందరూ సమన్వయంతో కలిసికట్టుగా శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.
Gudapati Srinivasa Rao: మరింత బలపడిన రేపల్లె వైసీపీ శ్రేణులు
గూడపాటి శ్రీనివాసరావు పార్టీలోకి రాకతో రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ మరింత శక్తివంతంగా మారుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాలు, నాయకుల బలాబలాల దృష్ట్యా రానున్న రోజుల్లో రేపల్లె రాజకీయ వాతావరణం మరింత ఆసక్తికరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
తిరుమల భక్తులకు కీలక సూచన.. బ్రహ్మోత్సవాల్లో పలు సేవలు రద్దు

