Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్‌కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు:నారా లోకేష్

జగన్‌కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు:నారా లోకేష్

వార్త 2 days ago

TDP Cadre Meeting: కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్మోహన్ రెడ్డి నటనకూ, ఆయన రాజకీయ వ్యూహాలకూ ఐక్యరాజ్యసమితి అవార్డులు కాక, సరికొత్త అవార్డులు ఇవ్వాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “జగన్‌కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు. బయట అందరినీ ముద్దులు పెట్టుకుంటూ, లోపల మాత్రం గొడ్డలి పోట్లు పొడవడం ఆయన నైజం. జగన్ చేసే అద్భుత నటనకు ‘భాస్కర్ అవార్డు’ గ్యారంటీగా ఇవ్వచ్చు” అని లోకేష్ ఎద్దేవా చేశారు.

Read Also :Rajya Sabha Elections 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ECI

ప్రస్తుత కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన-బీజేపీ) మధ్య లేనిపోని విభేదాలు సృష్టించి, చిచ్చు పెట్టేందుకు వైసీపీకి చెందిన కొందరు సైకోలు కుట్రలు పన్నుతున్నారని లోకేష్ ఆరోపించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ, ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి ఒక ‘క్యాన్సర్ గడ్డ’లా మారారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 Nara Lokesh Kadapa Speech

TDP Cadre Meeting: సొంత కుటుంబానికే అన్యాయం చేశారు: నారా లోకేష్ ఆరోపణలు

సొంత కుటుంబ సభ్యుల పట్ల జగన్ ప్రవర్తించిన తీరును నారా లోకేష్ ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. “సొంత తల్లిని, చెల్లిని రాష్ట్రం దాటి తరిమేశారు. సొంత బాబాయిని (వైఎస్ వివేకానందరెడ్డి) హతమార్చి, మరో చెల్లి కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి” అని విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన సొంత జిల్లాను, సొంత నియోజకవర్గాన్ని సైతం దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు.

2019 ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ వివేకా హత్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. “మొదట బాబాయికి గుండెపోటు వచ్చి చనిపోయారని కథలు అల్లారు. కానీ ఆ తర్వాత గొడ్డలివేటుతోనే ఆయన చనిపోయారనే నిజం బయటకు వచ్చింది. అంతటితో ఆగకుండా, తమ దొంగ పేపర్‌లో ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ అబద్ధపు కథనాలు రాసి, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి దొంగ ఫొటోలు వేశారు. జగన్ ఎంతటి మోసగాడో, ఆయన రాజకీయం ఎలాంటిదో ఇప్పుడు ప్రజలందరికీ పూర్తిగా అర్థమైంది” అని మంత్రి నారా లోకేష్ కడప వేదికగా స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha