Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్‌పై అచ్చెన్న ఫైర్.. వైసీపీని పాతిపెడదాం!

జగన్‌పై అచ్చెన్న ఫైర్.. వైసీపీని పాతిపెడదాం!

వార్త 3 weeks ago

Atchannaidu : వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహానాడులో మాట్లాడిన ఆయన.. జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు.

ఏ రాష్ట్ర అభివృద్ధికైనా పరిశ్రమలు కీలకమని, వాటి ద్వారానే ఉద్యోగాలు, ఆదాయం వస్తాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 24 నెలల్లోనే రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని చెప్పారు.

అన్న క్యాంటీన్లు, మూడు రాజధానులపై విమర్శలు

పేదలకు రూ.5కే భోజనం అందించే అన్న క్యాంటీన్లను ఎత్తివేయొద్దని అసెంబ్లీలోనే చెప్పినా జగన్ పట్టించుకోలేదని అచ్చెన్న విమర్శించారు. చివరకు అన్న క్యాంటీన్లను తొలగించడం దురదృష్టకరమన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని ఆరోపించారు.

Read also: AP Noise Pollution: ప్రార్థనా మందిరాల శబ్ద కాలుష్యంపై రఘురామకృష్ణంరాజు స్ట్రాంగ్ వార్నింగ్!

 Atchannaidu

వైసీపీ మళ్లీ రాకూడదన్న అచ్చెన్న

2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని, కానీ దాన్ని ప్రజల్లో బలంగా చెప్పుకోలేకపోయామని అచ్చెన్న అన్నారు. అదే సమయంలో జగన్ ప్రచారం చేసిన అబద్ధాలను ప్రజలు నమ్మారని, అందుకే 2019 ఎన్నికల్లో టీడీపీకి నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈసారి మాత్రం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా చేయాలని పిలుపునిచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also

ఈ ఏడాది చివరికి మూడు పోర్టులు ప్రారంభం.. మంతెన రామరాజు సంచలన ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha