Rajinikanth Jailer 2 Update: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'జైలర్ 2' (Jailer 2) షూటింగ్ అధికారికంగా ముగిసింది.2023లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'జైలర్ 2' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..
ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూ, షూటింగ్ స్పాట్ లో జరిగిన సెలబ్రేషన్స్ ఫోటోలను షేర్ చేసింది.
Read Also:Sadaa Actress: 'జయం' సినిమాలో ఆ సీన్ గుర్తొస్తే ఇప్పటికీ ఏడుపొస్తుంది
Rajinikanth Jailer 2 Update: సెట్స్‌లో పండుగ వాతావరణం
షూటింగ్ ముగిసిన సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, ఇతర సాంకేతిక నిపుణులు కలిసి కేక్ కట్ చేశారు.ఈ సీక్వెల్‌లో రజనీకాంత్ ‘ముత్తువేల్ పాండియన్’ పాత్రలో మరింత పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నారని సమాచారం.మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్‌లో కూడా పాన్ ఇండియా స్టార్స్ అతిథి పాత్రల్లో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.
Rajinikanth Jailer 2 Shooting Wrapped Up
అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సాంగ్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీకి ‘జైలర్’ సీక్వెల్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సెప్టెంబర్‌లో ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ పూర్తయింది కాబట్టి, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

