Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీల్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీల్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

వార్త 1 week ago

Nampally Train Fire Accident: హైదరాబాద్‌లోని నాంపల్లి (హైదరాబాద్ డెక్కన్) రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న హైదరాబాద్ – జైపూర్ ఎక్స్‌ప్రెస్ (Train No: 12720) కు చెందిన రెండు ఏసీ కోచ్‌లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.రాత్రి 7:50 గంటలకు జైపూర్ బయలుదేరాల్సిన ఈ స్పెషల్ రైలును సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫామ్ నంబర్ 4 పైకి తీసుకొస్తుండగా..

Read Also:Rajam Spandana Murder Case: కన్నతల్లే కసాయి కొడుక్కి బలి!

Nampally Train Fire Accident:

ఒక్కసారిగా B1, B2 ఏసీ కోచ్‌ల నుండి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో బోగీలు ఖాళీగా ఉండటంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, మూడు ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

ప్రమాదం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు మంటలు అంటుకున్న ఆ రెండు ఏసీ కోచ్‌లను రైలు నుండి త్వరితగతిన వేరు చేశారు.ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-జైపూర్ రైలును నాలుగున్నర గంటలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేసి పంపించారు. ఘటన వల్ల ఇతర రైళ్ల రాకపోకలకు పెద్దగా అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. ఘటనపై అధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మోడీ పిలుపు మేరకు సీఎం రేవంత్ కీలక నిర్ణయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha