Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్నతల్లే కసాయి కొడుక్కి బలి!

కన్నతల్లే కసాయి కొడుక్కి బలి!

వార్త 1 week ago

Rajam Spandana Murder Case: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో సంచలనం సృష్టించిన ముంజేటి స్పందన కిరాతక హత్య కేసును పోలీసులు పక్కా ఆధారాలతో ఛేదించారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను తిరుపతిలో అరెస్ట్ చేసినట్లు చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు అధికారికంగా వెల్లడించారు. కన్నతల్లే అని చూడకుండా కసాయిగా మార్చబడిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

మందలించిందని కన్నతల్లిపైనే కక్ష

పోలీసుల కథనం ప్రకారం.. రాజాం పట్టణం డోలపేటకు చెందిన ముంజేటి స్పందన అనే మహిళను ఆమె కన్నకుమారుడే అత్యంత దారుణంగా హతమార్చాడు. సదరు యువకుడు తన ప్రవర్తన మార్చుకోవాలని, పద్ధతిగా ఉండాలని తల్లి స్పందన పలుమార్లు మందలించింది. ఈ క్రమంలో తల్లిపై కక్ష పెంచుకున్న కుమారుడు, ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని స్కెచ్ వేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకుని, తనకు క్రికెట్ ఆట ద్వారా పరిచయమైన మరో స్నేహితుడిని వెంటబెట్టుకుని కన్నతల్లిని కిరాతకంగా చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తీసుకెళ్లి స్థానిక చెరువులో పడేశారు.

Read Also: Chilipally Theft: దొంగల బీభత్సం: 100 తులాల బంగారం, కిలో వెండి అపహరణ!

Rajam Spandana Murder Case: బంగారం, డబ్బుతో తిరుపతిలో ప్రత్యక్షం

తల్లిని హత్య చేసిన అనంతరం నిందితులిద్దరూ ఇంట్లో ఉన్న విలువైన బంగారం, నగదును సర్దుకుని పరారయ్యారు. ఆ డబ్బుతో ముంబై, విశాఖపట్నం వంటి నగరాలు తిరుగుతూ జల్సాలు చేశారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో చివరికి తిరుపతిలో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాఘవులు మాట్లాడుతూ.. సమాజంలో ఇటువంటి దారుణాలు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల నడవడిక మరియు స్నేహాల పట్ల ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha