Dailyhunt
జల సంరక్షణ మన అందరి బాధ్యత: అధికారుల పిలుపు

జల సంరక్షణ మన అందరి బాధ్యత: అధికారుల పిలుపు

వార్త 1 week ago

Kalyandurgam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న ఎస్ ఏ ఎస్ ఏ కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఐదుకల్లు రోడ్డులో "జలధార-జలహారతి" అనే థీమ్‌తో కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ వసంత్ బాబు, డీఎస్పీ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీ కృష్ణ భార్గవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాలను పెంపొందించే విధానాలపై స్పెషల్ ఆఫీసర్ వివరించారు.

Read Also:AP Ministers Singapore Tour: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటనకు జీవో జారీ

Kalyandurgam: స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ

మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంటలు తవ్వుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. నీటి కుంటలు, చెరువులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు నీటి లభ్యత ఈ వనరులపైనే అధికంగా ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. అనంత రం కార్యక్రమానికి హాజరైన సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మహిళా బిల్లుపై ప్రతిపక్షాల తీరు దారుణం: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha