Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'జలం.. జీవం.. జీవితం'.. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వీడియో

'జలం.. జీవం.. జీవితం'.. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వీడియో

వార్త 1 week ago

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. ఇటీవల ప్రారంభమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువలో కొన్ని కోతులు గుంపుగా వచ్చి స్వేచ్ఛగా నీళ్లు తాగుతూ తమ దాహాన్ని తీర్చుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

"జలం.. జీవం.. జీవితం" అనే భావోద్వేగపూరితమైన క్యాప్షన్‌ను ఈ వీడియోకు జోడించడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Also : Mogalthur Praja Vedika: మొగల్తూరు ప్రజావేదికలో ఎమ్మెల్యే పనితీరుపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

CM Chandrababu: దశాబ్దాల కలను సాకారం చేసిన వెలిగొండ ప్రాజెక్టు

మార్కాపురం జిల్లా పరిధిలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఫీడర్ కెనాల్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్‌లోకి విడుదల చేసి ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. కరవు పీడిత ప్రాంతానికి శాశ్వతంగా సాగు నీరు, తాగునీరు అందించడమే ఈ భారీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

మూగజీవాల దాహార్తిని తీరుస్తున్న ప్రాజెక్టు జలాలు

ఈ ప్రాజెక్టు ఫలితాలు కేవలం మానవులకే కాకుండా నల్లమల అటవీ ప్రాంతంలోని మూగజీవాలకు కూడా అందుతున్నాయని సీఎం పోస్ట్ చేసిన వీడియో నిరూపిస్తోంది. పిల్ల కోతులతో సహా వానర సమూహం కాలువ నీటిని తాగుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మానవాళితో పాటు సమస్త జీవరాశుల దాహార్తిని తీర్చడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తోందని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha