Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'జన నాయగన్'కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. రిలీజ్‌పై విజయ్ అధికారిక ప్రకటన

'జన నాయగన్'కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. రిలీజ్‌పై విజయ్ అధికారిక ప్రకటన

వార్త 0 months ago

Thalapathy Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయగన్' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు సర్వం సిద్ధమైంది.

నిజానికి ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాది సంక్రాంతి బరిలోనే నిలవాల్సింది. కానీ సెన్సార్ బోర్డుతో తలెత్తిన వివాదాలు, న్యాయపరమైన చిక్కుల కారణంగా గత ఏడు నెలలుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి, సెన్సార్ బోర్డు నుండి ‘ఎ’ (A) సర్టిఫికెట్ దక్కించుకుంది. ఈ విషయాన్ని హీరో విజయ్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

చిత్ర పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘జన నాయగన్’ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించగా, ప్రతిభావంతుడైన దర్శకుడు హెచ్. వినోద్ దీనిని తెరకెక్కించారు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా, మమిత బైజు, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రల్లో మెరవనున్నారు.

Thalapathy Vijay: ‘భగవంత్ కేసరి’ రీమేక్ ప్రచారంపై డైరెక్టర్ క్లారిటీ

తెలుగులో ఘనవిజయం సాధించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు ఇది రీమేక్ అని, లేదా కొన్ని కీలక సన్నివేశాల ఆధారంగా రూపొందిందనే ప్రచారం ఇండస్ట్రీలో బలంగా నడుస్తోంది. అయితే ఈ వార్తలపై దర్శకుడు హెచ్. వినోద్ స్పందిస్తూ.. ఇది ఎలాంటి రీమేక్ కాదని, పక్కా విజయ్ శైలిలో సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని స్పష్టం చేశారు. థియేటర్లలో అభిమానులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటపై ఆసక్తి

విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి, తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత థియేటర్లలోకి వస్తున్న మొదటి, అలాగే చివరి సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ఈ చిత్రంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ నటిస్తున్న ఈ ఆఖరి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha